బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆదివారం ఆటవిడుపు!

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆదివారం ఆటవిడుపు!
x
Highlights

ఆదివారం అంటే బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆటవిడుపే! హోస్ట్ తో మమేకమైపోవడం.. ఎవరు ఎలా ఆడుతున్నారనే అంచనాలు తెలుసుకోవడం, సరదా టాస్క్ లు అన్నిటినీ మించి ఎలిమినేషన్...

ఆదివారం అంటే బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆటవిడుపే! హోస్ట్ తో మమేకమైపోవడం.. ఎవరు ఎలా ఆడుతున్నారనే అంచనాలు తెలుసుకోవడం, సరదా టాస్క్ లు అన్నిటినీ మించి ఎలిమినేషన్ ప్రక్రియ. బిగ్‌బాస్‌ తెలుగు మూడో సీజన్ మొదటి వారం కొంచెం సరదాగా.. కొంచెం వేడిగా సాగింది. ఎలిమినేషన్స్ కి నామినేట్ అయిన వారిలో శనివారం ఇద్దరు సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోగా, మిగిలిన నలుగురు కాస్త ఉత్కంత తో ఆదివారం కనిపించారు.

నాగార్జున వచ్చీ రాగానే అందర్నీ పేరు పేరునా పలకరించి ఒక్కోరికీ వారి డ్రసింగ్ పై కాంప్లిమెంట్ ఇచ్చారు. తరువాత వారికి సరదా టాస్క్ లు ఇచ్చారు. మూడు కలర్ స్లిప్స్ అందరికీ ఇచ్చి. వాటిలో గుడ్, ఎవరేజ్, బ్యాడ్ వ్యక్తుల పేర్లు రాసి బౌల్ లో వేయమని చెప్పారు. తరువాత మూడు టీంలు గా అందర్నీ విడగొట్టి వారితో డంబ్ షేరాడ్స్ ఆడించారు. ఎ టీం నుంచి రోహిణి, బి టీం నుంచి వితికా షేరు, సి టీం నుంచి శ్రీముఖి నటించి చూపించారు. ఈ ఆటలో ఎ టీం విజేతగా నిలిచింది. ఇక హౌస్ మేట్స్ ఇచ్చిన ఓటింగ్ లో బాబా భాస్కర్ గుడ్ గానూ, జాఫర్ ఎవరేజ్ గానూ, హేమ బ్యాడ్ గానూ మెజార్టీ సభ్యులు ఓటేసినట్టు నాగార్జున చెప్పారు.

ఇక హౌస్ బయట నుంచి మొత్తం కోటీ ముప్పై లక్షల ఓట్లు మొదటి వారం వచ్చినట్టు చెప్పారు. ఇందులో కూడా హేమ కు లీస్ట్ ఓట్లు వచ్చాయని నాగార్జున ప్రకటించారు.

అందరూ మంచివాళ్లే..

బిగ్‌బాస్‌ సీజన్ 3 నుంచి మొదటి ఎలిమినేటర్ గా బయటకు వచ్చిన హేమ నాగార్జునతో మాట్లాడారు. నాగార్జున ఎవరు విన్నింగ్.. ఎవరు కన్నింగ్ చెప్పాలని హేమను కోరారు. దానికి ఫైనల్స్ వరకూ బాబా భాస్కర్, శ్రీముఖి ఉంటారని చెప్పారు. కన్నింగ్ అంటూ ఎవరూ లేరనీ, బిగ్‌బాస్‌ హౌస్‌లో అందరూ మంచివాళ్లే అనీ చెప్పారు. తనకు ఎవరి మీదా కోపం లేదన్నారు. వంటగది వల్లే గొడవలు వచ్చాయని, అది తప్ప తనపై ఎలాంటి ఫిర్యాదులు లేవని తెలిపారు. మహేష్‌.. మనసుకు మంచోడని మాటలు మాట్లాడేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండమని.. శ్రీముఖి, హిమజలకు ఆల్‌ది బెస్ట్‌ అని చెప్పింది. స్వీట్ హార్ట్‌ అషూ రెడ్డిని మాత్రం స్వార్థంగా ఉంచానని, తనకు బిగ్‌బాస్‌లో టైమ్‌ కావాలని.. అలీ బాగా ఆడుతున్నారని.. కొంచెం కోపం తగ్గించుకోవాలని రాహుల్‌కు.. వితికా, వరుణ్‌లు హౌస్‌లో ఉండాలని అందరూ కోరుకున్నారని అయితే మన్మథుడు చెప్పినప్పుడు అప్పుడప్పుడు కాంప్లిమెంట్స్‌ ఇవ్వాలని వరుణ్‌కు సూచించింది. టాస్క్‌లో టీచర్‌లా బాగా నటించిందని పునర్నవిని మెచ్చుకుంది. రవికృష్ణ మంచోడని.. అయితే మాట్లాడేప్పుడు జాగ్రత్తగా ఉండమని, రోహిణి అందరితో కలిసిపోతుందని.. అందర్నీ నమ్మేస్తుందని అలా ఉండకూడదని వివరించింది. ఇంటిపైన బెంగపెట్టుకోవద్దని హౌస్‌లో ఇంకా ఉండాలని ప్రజలు కోరుకున్నారని.. ఇకపై తాము జాఫర్‌ను చూడాలని అనుకుంటున్నట్లు తెలిపి హేమ హౌస్ నుంచి వెళ్లిపోయారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories