Pushpa Movie Shooting : పుష్ప ప్లాన్‌ మారింది.. ఏపీలో కాకుండా కేరళలో

Pushpa Movie Shooting : రంగస్థలం సినిమా తర్వాత పుష్ప అనే సినిమాని చేస్తున్నాడు దర్శకుడు సుకుమార్.. ఇందులో అల్లు అర్జున్ హీరోగా

Krishna
Published on: 13 Sept 2020 12:04 PM IST
Pushpa Movie Shooting : పుష్ప ప్లాన్‌ మారింది.. ఏపీలో కాకుండా కేరళలో
X

Pushpa movie 

Pushpa Movie Shooting : రంగస్థలం సినిమా తర్వాత పుష్ప అనే సినిమాని చేస్తున్నాడు దర్శకుడు సుకుమార్.. ఇందులో అల్లు అర్జున్ హీరోగా నటిస్తుండగా, రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇది అల్లు అర్జున్ కి 20 వ సినిమా కాగా సుకుమార్ తో మూడవ సినిమా.. ప్రస్తుతం కరోనా ప్రభావంతో సినిమా వాయిదా పడింది.. గంధపు చెక్కల స్మగ్లర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుందని , ఇందులో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడని సమాచారం..

తాజాగా 'పుష్ప' సినిమా షూటింగ్‌ ప్లాన్‌ మారిందని సమాచారం. సినిమా ఎక్కువ భాగాన్ని అడవుల్లోనే చిత్రీకరిస్తున్నారు. అయితే ముందుగా కేరళ అడవుల్లో సినిమాను షూట్‌ చేయాలనుకున్నారు. అయితే కరోనా నేపధ్యంలో తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్న అటవీ ప్రాంతంలో అక్టోబర్ నుంచి షూట్ చేయాలనీ అనుకున్నారు. అయితే తాజాగా మళ్లీ కేరళకే షూటింగ్‌ను షిఫ్ట్‌ చేయాలనుకుంటున్నారట చిత్రబృందం. డిసెంబర్ నుంచి అక్కడ చిత్రీకరణ మొదలు పెట్టనున్నారట...

ఇక సుకుమార్ , అల్లు అర్జున్ కాంబినేషన్లో ఇప్పటివరకూ వచ్చిన ఆర్య, ఆర్య 2 సినిమాలు ఎంత పెద్ద విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ అవుతూ ఉండడం, బన్నీ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Krishna

Krishna

Next Story