పుష్ప రెండవ భాగం ఇలానే ఉండబోతోంది అంటున్న సుకుమార్

పుష్ప: ది రూల్ కథ ఎలా ఉంటుందో చెప్పిన సుకుమార్

admin1
Updated on: 11 Jan 2022 9:00 PM IST
Sukumar Told About the Story of Pushpa-2 Movie | Telugu Movie News
X

 పుష్ప: ది రూల్ కథ ఎలా ఉంటుందో చెప్పిన సుకుమార్

Sukumar: ఈ మధ్యనే విడుదలై బ్లాక్ బస్టర్ అయిన "పుష్ప: ది రైజ్" సినిమా కథ మొత్తం ఒక మామూలు కూలీగా జీవితాన్ని మొదలు పెట్టిన పుష్పరాజ్ ఎర్రచందనం స్మగ్లింగ్ లో ఒక డాన్ గా ఎలా మారాడు అని కాన్సెప్టుతో తిరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పుష్ప రాజ్ కి మరియు పోలీస్ ఆఫీసర్ భన్వర్ సింగ్ షేకావట్ కీ మధ్య గొడవ కూడా ఏర్పడుతుంది. అయితే ఈ సినిమాకి రెండవ భాగం గా తెరకెక్కనున్న "పుష్ప: ది రూల్" ఎలా ఉండబోతోంది అనే విషయంపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సుకుమార్ "పుష్ప 2" గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

సినిమా రెండవ భాగం మొత్తం పుష్ప చిన్నతనం మరియు తన కి అతని తండ్రి, మరియు అన్నదమ్ముల మధ్య జరిగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పుష్ప జీవితానికి ఒక కంక్లూజన్ కూడా ఇవ్వబోతున్నట్లు మరియు భన్వర్ కి పుష్ప కి మధ్య జరిగిన గొడవ కి కూడా ఒక ఎండింగ్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా మొదటి పార్ట్ తో పోలిస్తే ఈ సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసేలా ఉంటుందట. "స్క్రిప్టు పూర్తయ్యాక పుష్ప 2 ఒక ఇంట్రెస్టింగ్ డ్రామా అని ఎవరిని నిరాశపరచదని అనిపించింది. అభిమానులు కూడా అంతే ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాము" అని అన్నారు సుకుమార్.

admin1

admin1

Next Story