Pushpa Movie: సుకుమార్ కు డెంగ్యు జ్వరం.."పుష్ప" షూటింగ్ కి బ్రేక్

Sandeep Reddy
Published on: 25 July 2021 4:52 PM IST
Sukumar Suffering with Dengue Fever So Pushpa Movie Shooting Break For Few days
X

పుష్ప మూవీ పోస్టర్ (ఫోటో: ట్విట్టర్) 

Pushpa Movie Update: ప్రముఖ దర్శకుడు సుకుమార్ తాజాగా అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిస్తున్న "పుష్ప" సినిమా షూటింగ్ కి మరోసారి బ్రేక్ పడింది. ఇప్పటికే కరోనా కారణంగా షూటింగ్ కి కొంతకాలం విరామం తర్వాత ఇటీవలే సినిమా షూటింగ్ మొదలుపెట్టిన చిత్ర యూనిట్ కి సుకుమార్ రూపంలో సినిమా మరి కొంతకాలం ఆలస్యం కానుంది. ప్రస్తుతం డెంగ్యు జ్వరంతో బాధపడుతున్న సుకుమార్ ఈ సినిమాకి దాదాపుగా వారం రోజుల పాటు బ్రేక్ ఇచ్చాడు. ఇప్పటికే హైదరాబాద్ లో 30 రోజుల పాటు జరగబోతున్న సినిమా షూటింగ్ షెడ్యుల్ లో సుకుమార్ ఇలా ఆకస్మికంగా జ్వరంతో బాధపడటంతో సినిమా షూటింగ్ సుకుమార్ కోలుకున్న తర్వాతే మొదలు కానుందని చిత్ర యూనిట్ తెలిపింది.

ఇక మరోపక్క "పుష్ప" సినిమా నిడివి అనుకున్న దానికంటే ఎక్కువ రావడంతో రెండు భాగాలుగా తెరకెక్కించాలని చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ తగ్గేదే లేకుండా నటించి ఇటీవల విడుదలైన టీజర్ తో యూట్యూబ్ ని షేక్ చేశాడు. సుమారుగా 250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ తన సంగీతాన్ని అందిస్తున్నాడు. కొన్ని నిజ జీవిత కథల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడిగా రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా ఈ చిత్రాన్ని ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేసిన షూటింగ్ ఆలస్యం కారణంగా విడుదల కూడా మరికొంత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి

Sandeep Reddy

Sandeep Reddy

Next Story