Pushpa - 2: పుష్ప రెండో పార్ట్ అప్పుడే అంటున్న సుకుమార్

Sukumar gave Clarity on the Second part of Pushpa Movie | Tollywood Latest News
x

Pushpa - 2: పుష్ప రెండో పార్ట్ అప్పుడే అంటున్న సుకుమార్

Highlights

Pushpa - 2: పుష్ప రెండవ పార్ట్ పై క్లారిటీ ఇచ్చిన సుకుమార్

Pushpa-2 Movie: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మొట్టమొదటి ప్యాన్ ఇండియన్ సినిమా పుష్ప. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 17 న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సునీల్, ఫహాధ్ ఫాసిల్, అజయ్ ఘోష్, తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

ఇక ఈ సినిమా రెండవ పార్ట్ పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్ర షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చ్ లో మొదలవుతుంది అని సుకుమార్ అన్నారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది దసరా లేదా క్రిస్టమస్ సమయంలో విడుదల కి సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. మొదటి పార్ట్ హిట్ అవడంతో "పుష్ప: ది రూల్" పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories