Sukumar: పుష్ప టీమ్‌లో వారికి ఒక్కొక్కరికి లక్ష రూపాయిలు ప్రకటించిన సుకుమార్..

Sukumar: ఒక్కొకళ్ళకి లక్ష ప్రకటించిన సుకుమార్

admin1
Updated on: 29 Dec 2021 2:15 PM IST
Sukumar Announces Rs 1 lakh for each of the Production Boys in Pushpa Movie
X

ప్రొడక్షన్ బాయ్స్ విషయంలో సుకుమార్ నిర్ణయం

Sukumar: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మొట్టమొదటి ప్యాన్ ఇండియన్ సినిమా "పుష్ప". రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. అయితే సినిమాలో అల్లు అర్జున్ నటన, సుకుమార్ దర్శకత్వనికి మంచి మార్కులు పడ్డాయి. సినిమా ఎంత పెద్ద హిట్ అయినా అందరూ నటీనటులు, డైరెక్టర్, మ్యూజిక్ గురించి మాత్రమే మాట్లాడతారు కానీ మిగతా వాళ్ళ కష్టం గురించి మాట్లాడరు. కానీ సుకుమార్ అందరి కష్టాన్ని గుర్తించి అందరి దృష్టిని ఆకర్షించారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సుకుమార్ ఒక ప్రకటన చేశారు. సినిమా హిట్ అవడానికి చిత్ర బృందం చాలా కష్టపడింది అని, ప్రొడక్షన్ మరియు సెట్ బాయ్స్ కూడా చాలా కష్టపడి పని చేశారని అన్నారు. రాత్రింబవళ్ళు సినిమా గురించి కష్టపడ్డారని, వారి కష్టమే ఈరోజు ఫలించిందని అన్న సుకుమార్ ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున బహుమతిని ప్రకటించారు. ప్రొడక్షన్ వాళ్ళ కష్టాలు కూడా అర్థం చేసుకున్న సుకుమార్ మంచి మనసుని ఇప్పుడు అందరూ సోషల్ మీడియా ద్వారా తెగ పొగుడుతున్నారు.

admin1

admin1

Next Story