బిగ్ బాస్ హౌస్ లోకి సుడిగాలి సుధీర్

K V D Varma
Updated on: 1 Aug 2019 3:48 PM IST
బిగ్ బాస్ హౌస్ లోకి సుడిగాలి సుధీర్
X

సుధీర్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ, సుడిగాలి సుధీర్ అంటే మాత్రం చిరునవ్వుతో గుర్తుపట్టేస్తారు. జబర్దస్త్ షో తో ఎంతో పాప్యులారిటీ సంపాదించుకున్నాడు సుధీర్. ఇప్పుడు జబర్దస్త్ తో పాటు ఇంకా రెండు మూడు టీవీ షో లతో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఈ సుడిగాలి బిగ్ బాస్ లో హడావుడి చేయనున్నాడట. త్వరలో టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ హౌస్ లోకి సుధీర్ వెళుతున్నాడు. అంటే, అందులో పాల్గోవడానికి కాదు. తను హీరోగా నటించిన సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమా ప్రమోషన్ కోసం. ఈమధ్య సుధీర్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. ఆ సినిమా ప్రమోషన్ కోసం బిగ్ బాస్ షో కి వెలుతున్నాడని తెలిసింది.

బిగ్ బాస్ హౌస్ లో పలు సినిమాలు గతంలో ప్రమోషన్ చేసుకున్నాయి. ఆ సినిమాలు దాదాపుగా హిట్. ఇప్పుడు సాఫ్ట్ వేర్ సుధీర్ కూడా అదేవిధంగా హిట్ కోడతాడేమో చూడాలి.


K V D Varma

K V D Varma

Next Story