మళ్ళీ సెట్స్ పైకి వెళ్లిన 'ఆర్ ఆర్ ఆర్'

మళ్ళీ సెట్స్ పైకి వెళ్లిన ఆర్ ఆర్ ఆర్
x
Highlights

కేవలం నందమూరి అభిమానులు మరియు మెగా అభిమానులు మాత్రమే కాక టాలీవుడ్ ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ఒకటి 'ఆర్ ఆర్ ఆర్'.

కేవలం నందమూరి అభిమానులు మరియు మెగా అభిమానులు మాత్రమే కాక టాలీవుడ్ ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ఒకటి 'ఆర్ ఆర్ ఆర్'. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా మొదటి షెడ్యూల్ గతేడాది డిసెంబర్లో పూర్తయింది. ప్రస్తుతం రెండవ షెడ్యూల్ కోసం హైదరాబాద్లో అద్భుతమైన సెట్ ను సిద్ధం చేశారు.

నిన్నటి నుండి రెండవ షెడ్యూల్ మొదలైంది . రామ్ చరణ్ ఎన్టీఆర్ ఈ సెట్లో షూటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ముందు వీళ్ళిద్దరి తో ఒక హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తున్న ట్లు తెలుస్తోంది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా ఎవరు నటిస్తున్నారు అనే విషయం పై చాలా కాలంగా చర్చ జరుగుతోంది కానీ ఇంకా క్లారిటీ మాత్రం రాలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories