SS Rajamouli Tested Positive: డైరెక్టర్ రాజమౌళికి కరోనా పాజిటివ్..

SS Rajamouli Tested Positive: కరోనా మహమ్మారి ప్రపంచంలో ఏ రంగాన్ని వదలకుండా పట్టిపీడిస్తోంది. చిన్నా.. పెద్ద, ధనిక.. పేద, అన్న తేడా లేకుండా అందర్నీ వణికిస్తోంది.

Raj
By Raj
Published on: 29 July 2020 9:38 PM IST
SS Rajamouli Tested Positive:  డైరెక్టర్ రాజమౌళికి కరోనా పాజిటివ్..
X
SS RAJAMOULI

SS Rajamouli Tested Positive: కరోనా మహమ్మారి ప్రపంచంలో ఏ రంగాన్ని వదలకుండా పట్టిపీడిస్తోంది. చిన్నా.. పెద్ద, ధనిక.. పేద, అన్న తేడా లేకుండా అందర్నీ వణికిస్తోంది. రాజకీయ నేతలు, సినిమా వాళ్ళు, పోలీసులు, వైద్యులు, జర్నలిస్టులు.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలానే ఉంది. తాజాగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి కరోనా భారిన పడ్డారు. ఈ విషయాన్నీ ఆయన తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయిందని తెలుపుతూ.. ఆయనతో పాటు కుటుంబ సబ్యులకు కూడా కరోనా సోకిందని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు.

కొద్దీ రోజుల క్రితం జ్వరం వచ్చి తగ్గిపోయిందని, అయితే ఈ రోజు వచ్చిన టెస్టు ఫలితాల్లో కాస్త కరోనా లక్షణాలు ఉన్నట్టు నిర్దారణ అయిందని ట్విట్టర్ లో వెల్లడించారు. అందువల్ల కుటుంబం అంతా అన్ని జాగ్రత్తలు, వైద్యుల సలహాలు తీసుకుంటూ హోం క్వారంటైన్ లో ఉంటున్నట్టు రాజమౌళి తెలిపారు. తన ఆరోగ్యం గురించి బయపడాల్సింది ఏమి లేదని, మేము ఇలా చేయడం వలన ఆరోగ్యంగా మారి వేరే వారికీ ప్లాస్మా డొనేట్ చేయొచ్చని చెప్పారు. కాగా ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాను నిర్మిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, రాంచంరణ్ తేజ్ లు టైటిల్ రోల్ పోషిస్తున్నారు.

Raj

Raj

Next Story