Ram Gopal Varma Tweets on Rajamouli: హే రాజమౌళి అర్ ఆర్ ఆర్ ట్రైలర్ డబ్బులు పెట్టి చూడాలి అనుకుంటున్నాం : వర్మ

Ram Gopal Varma Tweets on Rajamouli: లాక్ డౌన్ సమయంలో అందరూ మేకర్స్ ఖాళీగా ఉంటే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు.

Krishna
Published on: 20 July 2020 1:18 PM IST
Ram Gopal Varma Tweets on Rajamouli: హే రాజమౌళి అర్ ఆర్ ఆర్ ట్రైలర్ డబ్బులు పెట్టి చూడాలి అనుకుంటున్నాం : వర్మ
X
ram gopal varma tweets on rajamouli over rrr trailer

Ram Gopal Varma Tweets on Rajamouli: లాక్ డౌన్ సమయంలో అందరూ మేకర్స్ ఖాళీగా ఉంటే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల 'క్లైమాక్స్‌', 'నేక్డ్', 'కరోనా వైరస్‌' వంటి చిత్రాలను రిలీజ్ చేసిన వర్మ తాజాగా పవర్ స్టార్ పేరుతో ఓ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేశాడు వర్మ.. అయితే ఇక ఈ నెల 25 న ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేసేందుకు వర్మ ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈ ఈ ట్రైలర్ చూడాలంటే డబ్బులు పెట్టాల్సిందే అని అంటున్నాడు వర్మ..

ఇక ఇది ఇలా ఉంటే తాజాగా రామ్ గోపాల్ వర్మ, దర్శకుడు రాజమౌళిని ఉద్దేశిస్తూ ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ''హే రాజమౌళి.. ప్రస్తుతం ప్రపంచమంతా ఆన్‌లైన్‌కు మారుతోంది. ఈ పరిస్థితుల్లో అదే సరికొత్త మార్కెట్. ఇప్పుడంతా సరి కొత్తగా ఆలోచించడం కావాలి. మేమంతా 'ఆర్ఆర్ఆర్'ట్రైలర్ కు డబ్బులు చెల్లించి చూసే సమయం కోసం వేచి చూస్తున్నాం'' అంటూ ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్ పైన రాజమౌళి స్పందించలేదు.. ఇక అటు గతంలో వర్మ , రాజమౌళి మధ్య ట్విట్టర్ వేదికగా ఆసక్తికర చర్చలు నడిచాయి..

పవర్ స్టార్ ట్రైలర్ !

పవర్ స్టార్ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని ఈనెల 25న ఉదయం 11 గంటలకు ఆర్జీవీ వరల్డ్ థియేటర్ వెబ్‌సైట్‌లో విడుదల చేయనున్నట్టుగా వర్మ వెల్లడించాడు. అయితే చిత్ర ట్రైలర్ ని డబ్బులు పెట్టి చూడడం అనేది ప్రపంచ సినీ చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషం.. చిత్ర ట్రైలర్ కి రూ.25 చెల్లించాలని వర్మ ఇప్పటికే ప్రకటించాడు.

ఇక ఈ సినిమా ద్వారా ఓ కొత్త నటుడుని పరిచయం చేయబోతున్నాడు వర్మ.. ఆ నటుడికి అచ్చం పవన్ కళ్యాణ్ లాగే పోలికలు ఉండడంతో టిక్ టాక్ లో వీడియోలు చేస్తూ పాపులర్ అయ్యాడు.. ఈ వీడియోలు చూసి ఇతన్ని కాంటాక్ట్ అయ్యాడట వర్మ..అతన్ని ఆఫీక్ కి పిలిపించి కేవలం 10 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేస్తా అని వర్మ చెప్పుకొచ్చారట. ఇక ఇప్పటికే టైటిల్, సాంగ్ విషయంలో పెద్ద వివాదం సృష్టించిన వర్మ ఇక సినిమా తీసి ఇంకెన్ని వివాదాలు సృస్తిస్తాడో చూడాలి మరి.


Krishna

Krishna

Next Story