పుష్ప విషయంలో అల్లు అర్జున్ కి రాజమౌళి సలహా

"పుష్ప" ని ప్రమోట్ చేయండి అని బన్నీ కి చెబుతున్న రాజమౌళి

admin1
Published on: 13 Dec 2021 10:21 AM IST
SS Rajamouli Tells Allu Arjun to Promote Pushpa Movie
X

"పుష్ప" ని ప్రమోట్ చేయండి అని బన్నీ కి చెబుతున్న రాజమౌళి

SS Rajamouli-Pushpa Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "ఆర్ఆర్ఆర్". భారీ అంచనాల మధ్య ఈ సినిమా జనవరి 7న విడుదల కాబోతోంది. ఈ చిత్ర ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న రాజమౌళి పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈచిత్ర ఈవెంట్ లో మాట్లాడుతూ "ఆర్ ఆర్ ఆర్" సినిమా గురించి పక్కనపెడితే బాలీవుడ్లో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న తెలుగు సినిమా మరొకటి ఉందని, అది అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప అని చెప్పారు.

అక్కడే ఉన్న అల్లు అర్జున్ కృతజ్ఞతలు చెబుతుండగా రాజమౌళి "మీరు సినిమాని అక్కడ కూడా కచ్చితంగా ప్రమోట్ చేసి తీరాలి" అని అన్నారు. "అక్కడ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇంత మంచి సినిమాని మీ చేతుల్లో పెట్టుకొని మీరు ఖాళీగా ఉండకూడదు. మీరు ఖచ్చితంగా అక్కడ కూడా ప్రమోట్ చేసి తీరాలి. ఈ సినిమా కోసం అక్కడి ప్రజలు చాలా వెయిట్ చేస్తున్నారు" అని చెప్పుకొచ్చారు రాజమౌళి.

admin1

admin1

Next Story