శ్రీనువైట్ల దర్శకత్వంలో మంచు విష్ణు ?

Ruthvik
Published on: 20 Feb 2019 12:20 PM IST
శ్రీనువైట్ల దర్శకత్వంలో మంచు విష్ణు ?
X

స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అనేది అందరికి తెలిసిన విషయమే. ఎందుకంటే గత కొన్నేళ్ళుగా ఆయనకి అస్సలు హిట్స్ లేవు. మహేష్ బాబుకి "ఆగడు", రామ్ చరణ్ కి "బ్రూస్ లీ", వరుణ్ తేజ్ కి "మిస్టర్" అలాగే ఇటివలే రవితేజ కి "అమర్ అక్బర్ అంటోనీ" వంటి భారీ డిసాస్టర్స్ ని కట్టబెట్టాడు శ్రీనువైట్ల. కనీసం "అమర్ అక్బర్ అంటోనీ" సినిమాతో అయిన హిట్ కొడతాడు అనుకుంటే అసలు చాలా దారుణమైన సినిమాని తెలుగు ప్రేక్షకులకి అందించాడు శ్రీను వైట్ల. ఇక తెలుగు హీరోలు ఎవ్వరు శ్రీనువైట్ల కి డేట్స్ ఇవ్వరు అని అనుకునే సమయం లో మంచు విష్ణు మాత్రం శ్రీనువైట్ల కి తన డేట్స్ ఇచ్చాడు. "ఆచారి అమెరికా యాత్ర" సినిమా తరువాత ఒక్క సినిమా కూడా సైన్ చెయ్యని విష్ణు శ్రీను వైట్ల తో సినిమాకి ఓకే చెప్పాడు అంట. వీళ్ళిద్దరి కాంబినేషన్ ఇదివరకు "డీ" అనే బ్లాక్ బస్టర్ సినిమా వచ్చింది. మరో రెండో సారి రిపీట్ అవుతున్న ఈ కాంబినేషన్ వల్ల శ్రీనువైట్ల హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

Ruthvik

Ruthvik

Next Story