Khushi Kapoor: శ్రీదేవి అభిమానులను ఖుషీ చేయనున్న ఖుషీకపూర్

Khushi Kapoor: శ్రీదేవి చిన్న కుమార్తె జాన్వీ కపూర్ తర్వాత ఖుషీ కపూర్ వెండితెర మీద మెరవబోతున్నట్లు టాలీవుడ్ టాక్

Kranthi
Published on: 26 May 2021 8:29 AM IST
Sridevis Younger Daughter Khushi Kapoor Debut Tollywood
X

Sridevis Younger Daughter Khushi Kapoor(File Image)

Khushi Kapoor: అలనాటి అందాల తార శ్రీదేవి గురించి ప్రత్యేక చెప్పాల్సిన పనిలేదు. శ్రీదేవి 2.0 ఇప్పటికే అందరికీ పరిచయమైంది. ఇప్పుడిక శ్రీదేవి 3.0 రాబోతుంది. అవును జాన్వీ కపూర్ తర్వాత ఖుషీ కపూర్ వెండితెర మీద మెరవబోతుంది. తండ్రి బోనీ కపూర్ ఆ ప్లాన్లలోనే బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. జాన్వీ కపూర్ మొదట్లో తడబడ్డా.. ఇప్పుడు బాలీవుడ్ లో నిలదొక్కుకుంది. ట్యాలెంటెడ్ అని ప్రూవ్ చేసుకుంది. అక్క బాటలోనే చెల్లి కూడా అడుగులు వేయనున్నది. శ్రీదేవి ఫీచర్స్ తో ఇద్దరూ సిల్వర్ స్క్రీన్ పై మెరిసిపోనున్నారు. శ్రీదేవిని మిస్ అవుతున్న చాలామంది అభిమానులు ఇప్పటికే జాన్వీ కపూర్ లో తమ ఆరాధ్య దేవతను చూసుకుంటున్నారు.. ఇక ఖుషీ కపూర్ కూడా శ్రీదేవి అభిమానులను అలరించనున్నదని టాలీవుడ్ టాక్.

ఇప్పటికే బాలీవుడ్ లో జాన్వీ కపూర్ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది. అంతేకాకుండా ప్రస్తుతం వరుస సినిమాలో నటిస్తుంది. ఇదిలా ఉంటే తన సోదరి ఖుషి కపూర్ కూడా వెండితెరకు ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు విదేశాల్లో చదువు పూర్తి చేసుకున్న ఖుషి.. ఇక సినిమాలలో అడుగుపెట్టాలని అనుకుంటుందట.

ఇక తన తండ్రి బోనీ కపూర్ కూడా ఆమెను సినిమాల్లో పరిచయం చేయడానికి ఎంతో తాపత్రయం పడుతున్నారని తెలుస్తుంది. మొదట తనను బాలీవుడ్ సినిమాతో పరిచయం చేయాలనుకున్నాడట బోనీ కపూర్. కానీ ఇప్పుడు తెలుగు సినిమా తో పరిచయం చేయాలని చూస్తున్నారట. ఇక ఖుషి కపూర్ కూడా యాక్టింగ్ లో శిక్షణ కూడా తీసుకుందని తెలుస్తుంది. మొత్తానికి శ్రీదేవి కూతురు టాలీవుడ్ ఎంట్రీ తో కనిపించనుందని తెలిసింది. ఇక ఏ సినిమా హీరో అనే విషయం తెలియక పోగా.. ఈ విషయం గురించి త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.

Kranthi

Kranthi

Next Story