తిప్పరా మీసం అంటున్న శ్రీ విష్ణు

తిప్పరా మీసం అంటున్న శ్రీ విష్ణు
x
Highlights

ఇప్పటిదాకా సాఫ్ట్ మరియు లవర్ బాయ్ పాత్రలో కనిపించిన శ్రీ విష్ణు ఇప్పుడు సరికొత్త లుక్ తో కనిపించనున్నాడు. కృష్ణ విజయ్ ఎల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న "...

ఇప్పటిదాకా సాఫ్ట్ మరియు లవర్ బాయ్ పాత్రలో కనిపించిన శ్రీ విష్ణు ఇప్పుడు సరికొత్త లుక్ తో కనిపించనున్నాడు. కృష్ణ విజయ్ ఎల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న " 'తిప్పరా మీసం' అనే చిత్రంలో శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్నాడు. కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. గుబురు గడ్డంతో పెద్ద పెద్ద మీసాలతో శ్రీ విష్ణు ఈ సినిమాలో కొత్త గా కనిపిస్తున్నాడు. ఇక ఈ మధ్యనే 'వీర భోగవసంతరాయలు' అనే సినిమాతో డిజాస్టర్ అందుకున్న శ్రీ విష్ణు ఈసారి ఎలాగైనా హిట్ అందుకోవాలనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ మరియు కృష్ణ విజయ ప్రొడక్షన్స్ బ్యానర్ లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీ ఓం సినిమా సమర్పణలో ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. శ్రీ విష్ణు లుక్ లాగానే సినిమా కథ కూడా చాలా కొత్తగా ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. రోహిణి, రఘుబాబు, అచ్చుత్ రామారావు, ఏ.ఎస్.రవికుమార్ చౌదరి, అజయ్ ఘోష్, రవి వర్మ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సురేష్ బొబ్బిలి ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories