నాగబాబు బాటలోనే అనసూయ కూడా..జబర్దస్త్ లో కొత్త యాంకర్ శ్రీముఖి?

నాగబాబు బాటలోనే అనసూయ కూడా..జబర్దస్త్ లో కొత్త యాంకర్ శ్రీముఖి?
x
జబర్దస్త్ ను వీడనున్న అనసూయ?
Highlights

జబర్దస్త్ కామెడీ షో ను యాంకర్ అనసూయ వీడుతున్నారని చెబుతున్నారు. ఆమె స్థానంలో శ్రీముఖి రానున్నట్టు వార్తలు వస్తున్నాయి.

జబర్దస్త్ షో ఓ నవ్వుల సంచలనం. తెలుగు టీవీ తెరపై ఎన్నో చరిత్రలు సృష్టించిన షో అది. ఈ షో లో ఒక్క స్కిట్ చేసినా చాలు అనుకునే ఔత్సాహికులు ఎందరో. స్కిట్ లలో చిన్న పాత్ర వేయడానికి వచ్చి.. తమ టాలెంట్ తో టీమ్ లీడర్స్ గా ఎదిగిన కళాకారులు ఎందరో ఉన్నారు జబర్దస్త్ లో. ఇక అందులో తమ నైపుణ్యాల్ని చూపించి వెండి తెర బాట పట్టిన వారూ ఉన్నారు. నిజానికి వెండితెర పై కామెడీ వేషాలు వేయాలని ఉత్సాహం ఉంటె..జబర్దస్త్ లో ఒక్కసారి ప్రూవ్ చేసుకుంటే చాలు అనేట్టుగా ఔత్సాహికులకు ఉత్సాహాన్నిచ్చింది జబర్దస్త్. ఇప్పుడు ఈ షో పై అనేక ప్రచారాలు నడుస్తున్నాయి. ఈ షో ఆగిపోతుందని కొందరు.. అందరూ కొత్త వాళ్ళతో ముందుకు సాగుతుందని కొందరు.. ఇలా ఎవరికీ తోచినట్టు వారు మాట్లాడుకుంటున్నారు.

దీనికి కారణం లేకపోలేదు. జబర్దస్త్ ప్రారంభం నుంచి తన చిరునవ్వుతో న్యాయనిర్ణేతగా ఇటు ప్రేక్షకుల్లోనూ, అటు షో లో నటించే వారిలోనూ ఎంతో పేరు తెచ్చుకున్న నాగబాబు ఈ వారంతో జబర్దస్త్ వదిలేస్తున్నారు. అది తాత్కాలికం అని ఇంత వారకూ అనుకున్నా ఆదివారం నుంచి అయన జీ తెలుగులో కనిపించబోతున్నారంటూ వచ్చిన ప్రోమో శాశ్వతంగానే నాగబాబు జబర్దస్త్ వదిలేస్తున్నారని ఫిక్స్ అయిపోయారందరూ. ఆయన తో పాటు చాలా మంది జబర్దస్త్ కు గుడ్ బాయ్ చెప్పేస్తారని ప్రచారం జరుగుతోంది. చమ్మక్ చంద్ర ఈ విషయం పై స్పష్టత కూడా ఇచ్చేశారు.

ఇక నాగబాబు బాటలోనే..యాంకర్ అనసూయ కూడా జబర్దస్త్ నుంచి తప్పుకుంటున్నారనే వార్త ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. జబర్దస్త్ ప్రారంభం నుంచి తన అందచందాలతో.. యాంకరింగ్ ప్రతిభతో మంచి మార్కులు కొట్టిన అనసూయ ఇక్కడ నుంచి సినిమాల్లో అవకాశాలు సంపాదించి.. రంగస్థలం లాంటి హిట్ సినిమాలో రంగమ్మ అత్తగా మెప్పించింది. ఇప్పుడు జబర్దస్త్ షో నుంచి ఆమె తప్పుకుంటున్నట్టు తెలుస్తోంది.

రాములమ్మ రాబోతోందా?

అనసూయ స్థానం లో పటాస్ రాములమ్మ శ్రీముఖి జబర్దస్త్ యాంకర్ గా రాబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. బిగ్ బాస్ సీజన్ 3 లో రన్నరప్ గా నిలిచిన శ్రీముఖి జబర్దస్త్ యాంకర్ గా రావడానికి సిద్ధం అయినట్టుగా కనిపిస్తోంది. గతంలో శ్రీముఖి కి జబరదస్త్ యాంకర్ గా అవకాశం వచ్చినా ఆమె అందుకు అంగీకరించలేదు. అయితే, ఇప్పుడు జబర్దస్త్ యాంకర్ గా చేయడానికి ఒప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే వచ్చే వారం జబర్దస్త్ లో అనసూయ బదులుగా శ్రీముఖి ని చూసే అవకాశం ఉంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories