Nagarjuna: ప్రత్యేక సెట్ లో నాగార్జున మూవీ!

Special set for Nagarjunas next
x

నాగార్జున

Highlights

Nagarjuna: అక్కినేని నాగార్జున, ప్రవీణ్ సత్తారు ప్రస్తుతం ఓ క్రేజీ ప్రాజెక్టుతో ముందుకు రానున్నారు.

Nagarjuna: అక్కినేని నాగార్జున, ప్రవీణ్ సత్తారు ప్రస్తుతం ఓ క్రేజీ ప్రాజెక్టుతో ముందుకు రానున్నారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కించే ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించనుంది.

తాజా వార్తల మేరకు, అన్నపూర్ణ స్టూడియోలో ఓ ప్రత్యేక సెట్‌ను నిర్మించాలని ఫిల్మ్ యూనిట్ ప్లాన్ చేస్తుందంట. ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించేందుకు ఈ సెట్‌ను వేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రత్యేక సెట్‌ పూర్త్యయ్యాక మేకర్స్ తిరిగి షూటింగ్‌ను ప్రారంభించనున్నారంట. ఈ సినిమా షూటింగ్‌ను జూలై రెండో వారంలో మొదలుపెట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే, మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేశారంట. కాగా, మొదటి షెడ్యూల్ అవుట్‌ఫుట్‌ తో టీం చాలా హ్యాపీగా ఉన్నారంట. ఈ సినిమాలో నాగార్జున పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. నారాయణ దాస్ నారంగ్, రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే నాగార్జున 'బంగర్రాజు' సినిమాను కూడా లైన్‌లో పెట్టాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ కూడా మొదలుపెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories