Rashmika Mandanna: స్పెషల్ గిఫ్ట్ ఎవరు పంపారో... కానీ...!

Rashmika Mandanna: హోలీ పండగ సందర్భంగా రష్మిక మందాన్న ఓ స్పెషల్ గిఫ్ట్‌ అందుకుంది.

Venkata Chari
Published on: 29 March 2021 5:30 PM IST
Special Gift Receives Rashmika Mandanna on the Occasion of Holi Festival 2021
X

రష్మిక మందాన్న (ఫొటో ఇన్‌స్టాగ్రాం)

Rashmika Mandanna: హోలీ పండగ సందర్భంగా రష్మిక మందాన్న ఓ స్పెషల్ గిఫ్ట్‌ అందుకుంది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రాంలో వెల్లడించింది ఈ కన్నడ బ్యూటీ. "ఈ గిఫ్ఠ్ ఎవరు పంపారో కానీ, అది నాకు సరిగ్గా సరిపోయింది. ఈ రింగ్‌ నాకు నచ్చింది. అలాగే మీరు రాసిన సీక్రెట్‌ మెసేజ్‌ కూడా చదివాను" అని రాసుకొచ్చింది. వేలికి ఉంగరం తొడిగిన ఫొటోలతో ఫోజులిచ్చింది ఈ ముద్దుగుమ్మ. అయితే అభిమానులు మాత్రం వీరాభిమాని లేక సీక్రెట్‌ బాయ్‌ఫ్రెండ్‌ ఈ రింగ్ ను పంపిఉంటాడని చర్చించుకుంటున్నారు.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో 'పుష్ప', శర్వానంద్‌ 'ఆడాళ్లు మీకు జోహార్లు' సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. సిద్దార్థ్‌ మల్హోత్రా 'మిస్టర్‌ మజ్ను'తో బాలీవుడ్‌లోకి, హీరో కార్తీ 'సుల్తాన్‌' చిత్రంతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. కాగా రష్మిక ప్రస్తుతం ముంబై లో మిస్టర్ మజ్ను షూటింగ్ లో ఉంది.

Venkata Chari

Venkata Chari

Next Story