Karthika Deepam: ఏం జరిగిందో చెప్పు? వంటలక్కను నిలదీసిన సౌర్య!

Karthika Deepam: ఏం జరిగిందో చెప్పు? వంటలక్కను నిలదీసిన సౌర్య!
x
Highlights

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ తిరుగులేని టీఆర్పీ రేటింగ్ లతో దూసుకుపోతున్న సీరియల్ కార్తీక దీపం. ప్రతిరోజూ కొత్త మలుపులతో.....

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ తిరుగులేని టీఆర్పీ రేటింగ్ లతో దూసుకుపోతున్న సీరియల్ కార్తీక దీపం. ప్రతిరోజూ కొత్త మలుపులతో.. ఇంటిల్లపాదికి వినోదాన్ని పంచుతున్న కార్తీకదీపం సీరియల్. ఇప్పటి వరకూ 757 వ ఎపిసోడ్ కు చేరుకున్న కార్తీకదీపం సీరియల్ మరింత ఆసక్తి కరంగా మారింది.

మీ నాన్న మా నాన్న ఒక్కరే అని హిమతో చెప్పేసింది సౌర్య. దానికి ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన హిమ ఇది నిజమేనా అని అడుగుతుంది. అవును ఇది నిజమే అని చెబుతుంది. అలా అయితే మీ అమ్మ మా ఇంట్లో ఎందుకు ఉంటోంది? అని ప్రశ్నల వర్షం కురిపిస్తుంది హిమ. మా అమ్మ అంటే డాక్టర్ బాబు కి ఇష్టం లేదు అందుకే ఇలా చేస్తున్నారు. అంటుంది సౌర్య. హిమ వెంటనే సౌందర్య, వంటలక్క ఇదరి దగ్గరికీ వెళ్లి మా డాడీ యే సౌర్య వాళ్ళ డాడీ అంట కదా అని అడుగుతుంది. వాళ్ళిద్దరూ ఏ సమాధానం చెప్పాలో తెలీక చూస్తుంటారు. ఇంతలో సౌర్య నేను ఈ విషయం నీకు చెప్పానని డాక్టర్ బాబుకి చెప్పొద్దూ. ఆయనకు నేను మాట ఇచ్చాను ఈ విషయం ఎవరికీ చెప్పానని అని హిమతో చెబుతుంది. దానికి సౌందర్య చేసిందంతా చేసి ఇప్పుడు ఇలా చేబుతావెంటే అని కోపంగా అడుగుతుంది. దీంతో సౌర్య కోపంగా నాన్న ఉండగా నేను నాన్న లేనట్టుగా ఎలా ఉండాలి.. నేను అందరికీ చెప్పేస్తాను అంటూ అరుస్తుంది.. కట్ చేస్తే మంచం మీద నుంచి ఉలిక్కిపడి లేస్తాడు కార్తీక్. ఇదంతా కల అని తానికి అర్థం అవడానికి కొద్ది సేపు పడుతుంది.

నేను సౌందర్య గారి మనవరాల్ని..

కార్తీక్ హిమను స్కూలుకు వేల్లోద్దని ఆపేస్తాడు. సౌర్య తన గురించి అందరికీ చెప్పెస్తుందేమో అని భయంతో ఉంటాడు. ఇదిలా ఉంటె, అక్కడ సౌర్య వంటలక్కతో కార్తీక్ గురించి చెబుతుంది. తనను ఎలా ఒడార్చాడో..ఎంత ధరిర్యం చెప్పాడో డాక్టర్ బాబు అంటూ వివరిస్తుంది. కన్నీళ్ళతో అన్నీ విన్న వంటలక్క నువ్వు డాక్టర్ బాబును నాన్న అనిపిలిచినపుడు నేను అక్కడ లేకపోవడం బాధగా ఉంది అంటుంది. సౌర్య దీపను అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్లావు? నిన్ను ఎవరన్నా ఏమన్నా అన్నారా? ఎం జరిగింది అంటూ ప్రశ్నిస్తుంది. దానికి దీప నేను సమయం వచ్చినపుడు అన్నీ చెబుతాను అత్తమ్మా అని సమాధానం ఇస్తుంది. దాంతో సౌర్య వంటలక్క మీద కోపగించుకుంటుంది. నీవు చెప్పకపోతే నేను తెలుసుకోలేను అనుకుంటున్నావా? నాన్ననే కనిపెట్టిన దాన్ని.. ఈ విషయం కనుక్కోవడం పెద్ద కష్టం కాదు అంటూ చెబ్తుంది. నేను సౌందర్య గారి మనవరాల్ని అంటూ వంటలక్కకి చెప్పి వెళ్ళిపోతుంది.

ఇక అక్కడ సౌందర్య తన భర్త తో కార్తీక్ ప్రవర్తనపై మాట్లాడుతుంది. ప్రతి చిన్న విషయానికి మండి పడుతున్నాడు అంటూ బాధ పడుతుంది.

ఈ రోజు ప్రసారం కానున్న ఎపిసోడ్ లో జరిగే సంఘటనలు ఇవే. మరి సౌర్య వంటలక్క అసృశ్యం కావడానికి కారణం తెలుసుకుందా? కార్తీక్ తన విషయం హిమకు తెలియకుండా ఉండటానికి ఎం చేయబోతున్నాడు? ఇవన్నే రేపటి ఎపిసోడ్ లో చూడొచ్చు. ఈరోజు 16 మార్చిన ప్రసారం కానున్న ఎపిసోడ్ లో సౌర్య తన తల్లి వంటలక్కతో చేసిన చాలెంజ్ ముఖ్య ఆకర్షణ్ గా చెప్పొచ్చు. వంటలక్క బాధకు కారణం తెలుసుకోవడం కోసం ఆమె ప్రయత్నమూ తెలుసుకోవచ్చు. ఈ వివరాలు మరింత స్పష్టంగా తెలుసుకోవాలంటే మా టీవీలో ప్రసారం అవుతున్న కార్తీక దీపం చూసి తీరాల్సిందే!

గతంలో జరిగిన కథ ఇదీ..

కార్తీక్, దీప భార్యాభర్తలు. వారిద్దరి అన్యోన్యత చెడగొట్టాలని అప్పటికే కార్తీక్ను ప్రేమించి దక్కిన్చుకోలేకపోయిన మౌనిత భావిస్తుంది. అందుకు కొన్ని ఎత్తుగడలు వేస్తుంది. దాంతో కార్తీక్, దీప విడిపోయి విడివిడిగా జీవిస్తుంటారు. వారికి ఇద్దరు కవల పిల్లలు. సౌర్య.. హిమ. విడివిడిగా ఉంటున్న కార్తీక్, దీపల దగ్గర చెరొక పాప ఉంటారు. సౌర్య తల్లి దగ్గర ఉంటె, హిమ తండ్రి దగ్గర ఉంటుంది. వంటలక్కగా అందరికీ వంటలు చేసి క్యారేజీలు పంపిస్తూ సౌర్యను చదివించుకుంటూ ఉంటుంది ఆత్మాభిమానం గల దీప. మరోవైపు డాక్టర్ బాబుగా కార్తీక్ హిమకు ఎ లోటూ లేకుండా చూసుకుంటాడు. చాలా కాలం బాగానే నడిచింది. అయితే, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాకా.. సమస్యలు మొదలవుతాయి. సౌర్య నాన్న ఎవరు అని అడిగితె, హిమ అమ్మ కావాలని మారం మొదలు పెడుతుంది. ఈ క్రమంలో సౌర్యకు నాన్న ఎవరో తెలుస్తుంది. కానీ, హిమ కు తల్లి ఎవరో తెలీదు. ఇక తన పుట్టినరోజుకు అమ్మను చూపించాలని కార్తీక్ ను హిమ కోరుతుంది. ఆమె ఒత్తిడిని భరించలేని కార్తీక్ చనిపోయిన తన పాత ప్రేయసి ఫోటోను చూపించి ఆమె హిమ తల్లి అని చెబుతాడు. దీంతో దీప హతాశురాలవుతుంది. పుట్టినరోజు పార్టీ నుంచి అకస్మాత్తుగా వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి సౌర్య తన తల్లి వంటలక్క కోసం బాధపడుతూనే ఉంది. మరోవైపు కార్తీక్ మనసులో దీప మీద విషబీజాలు మరింత నాటడానికి మౌనిక ప్రయత్నాలు చేస్తుంది. కొన్ని పరిణామాల తరువాత వంటలక్క ఇంటికి వస్తుంది. అయితే, ఈ క్రమంలో డాక్టర్ బాబు తన తండ్రి అన్న విషయం చెబుతుంది సౌర్య. మరి తరువాత ఎం జరిగిందనేది ప్రస్తుతం నడుస్తున్న కథ..

ఇంటిల్లపాది మనసునూ దోచుకున్న కార్తీక దీపం సీరియల్ ప్రతిరోజూ స్టార్ మా టీవీలో వస్తోంది. అదేవిధంగా హాట్ స్టార్ లో ఈ సీరియల్ ఎపిసోడ్ లు అన్నీ అందుబాటులో ఉన్నాయి. అనుబంధాలు.. అనుమానాల మధ్య నలిగిపోయిన భార్యాభర్తలు.. విడివిడిగా ఉంటున్న తల్లి దండ్రుల మధ్య నలిగిపోతున్న పిల్లలు.. మంచిని చేడుగా మర్చగలిగే చెప్పుడుమాటలు చేసే అపకారం అన్నిటినీ కలబోసి అందిస్తోంది కార్తీక దీపం. మానవ బంధాల మధ్య ఉండే సున్నిత విషయాలను చక్కగా చూపిస్తున్న కార్తీక దీపం సీరియల్ మీరూ మిస్ కాకుండా చూసి ఎంజాయ్ చేయండి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories