Karthika Deepam: వంటలక్క ఎక్కడికి వెళ్ళింది.. నిలదీసి అడుగుతున్న కార్తీక్..సౌందర్య

Karthika Deepam: వంటలక్క ఎక్కడికి వెళ్ళింది.. నిలదీసి అడుగుతున్న కార్తీక్..సౌందర్య
x
a scene from karthika deepam serial (image curtesy: star maa and hot star)
Highlights

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ తిరుగులేని టీఆర్పీ రేటింగ్ లతో దూసుకుపోతున్న సీరియల్ కార్తీక దీపం. ప్రతిరోజూ కొత్త మలుపులతో.....

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ తిరుగులేని టీఆర్పీ రేటింగ్ లతో దూసుకుపోతున్న సీరియల్ కార్తీక దీపం. ప్రతిరోజూ కొత్త మలుపులతో.. ఇంటిల్లపాదికి వినోదాన్ని పంచుతున్న కార్తీకదీపం సీరియల్ ఇప్పటి వరకూ 755 వ ఎపిసోడ్ కు చేరుకున్న కార్తీకదీపం సీరియల్ మరింత ఆసక్తి కరంగా మారింది.

అకస్మాత్తుగా మాయం అయిన వంటలక్క అంటే అకస్మాత్తుగా తిరిగి ఇంటికి వచ్చింది. కార్తీక్ ఆమెను తీసుకు వచ్చి..చెప్పకుండా వేల్లిపోయినందుకు చెంప పగల గొట్టాడు. దీంతో సౌందర్య, ఆమె భర్త హతాశులయ్యారు. ఎప్పుడూ సాధారణంగా మాట్లాడని దీప మామగారు కూడా దీపాని అన్ని రకాలుగానూ ప్రశ్నలు అడిగాడు. ఎవరెన్ని అడిగినా దీపా మౌనంగా ఏడుస్తూనే.. నా కూతురు ఏది అని ప్రశ్నిస్తుంది. దీంతో కోపం వచ్చిన కార్తీక్..నీకు ఇప్పుడు కన్న ప్రేమ గుర్తొచ్చిందా? సౌర్యను వదిలేసి వెళ్ళినపుడు ఈ ప్రేమ ఏమైంది అంటూ ప్రశ్నిస్తాడు. అంతే కాకుండా నువ్వు భార్యగా ఓడిపోయావు.. తల్లిగా ఓడిపోయావు.. అసలు ఆడదానిగానే ఓడిపోయావు అంటూ నిందిస్తాడు. ఇవన్నీ పక్కన పెడితే నీ అత్తమామ నీకు సపోర్ట్ ఉన్నారని రెచ్చిపోతున్నావేమో, ఇది నా జీవితం. నా జీవితం లోకి మళ్ళీ నువ్వు రావాలని ప్రయత్నించావో ఊరుకునేదే లేదు అంటూ విరుచుకు పడతాడు.

ఎవరెన్ని అన్నా మౌనంగానే, ఏడుస్తూనే.. సౌర్య కోసం ఇంట్లోకి వెళ్ళబోతుంది దీప. కార్తీక్ ఆమెను ఆపి నా యింట్లోకి వెళ్ళే అర్హత హక్కు నీకు లేదంటూ అడ్డుపడతాడు. ఈ లోపు దీపను వెదకడానికి బయటకు వెళ్ళిన సౌర్య, హిమ లు తిరిగి వస్తారు. వాళ్ళు వస్తూనే వంటలక్కను చూసి కన్నీళ్ళ పర్యంతం అవుతారు. సౌర్య పరుగున తల్లి దగ్గరకు వెళ్లి అమ్మా ఎక్కడికి వెళ్ళిపోయావు? నువ్వేల్లిపోతే నేనేమైపోతాను అనుకున్నావు? నాకెంత భయం వేసిందో తెలుసా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించి దీపను ముద్దులతో ముంచెత్తుతుంది. మరో వైపు హిమ కూడా దీప దగ్గరకి చేరి..వంటలక్క నువ్వెంత మంచిదానివి..ఇలాంటి పని ఎందుకు చేశావు? నాకు నువ్వు కనిపించకపోయినా దగ్గర నుంచి తలనోపి-ఫై, జ్వరం వచ్చేశాయి. సౌర్యకు నాన్న లేదు. నాకు అమ్మ లేదు. కానీ నువ్వు మా అమ్మ అని అనుకుంటాను. అటువంటిది నువ్వు కనిపించకపోయే సరికి ఎంత బాధ వేసిందో తెలుసా? అంటూ ఆమెను వాటేసుకుని ఏడుస్తుంది. అది చూసిన కార్తీక్ హిమను ఇంట్లోకి వెళ్ళిపొమ్మని చెబుతాడు కతినంగా.

హిమను తీసుకుని వంటలక్క తన ఇంటికి బయలుదేరుతూ కార్తీక్ తో.. నేను మీ కంట పడటం నా అదృష్టం డాక్టర్ బాబు అంటుంది. సౌర్య కూడా కార్తీక్ దగ్గరకు వస్తుంది. ఆమె దగ్గరకు రావడం చూసిన కార్తీక్ ఇదేంటి నా దగ్గరకు వస్తుంది..కొంప తీసి నాన్నా అని పిలవడు కదా అని కంగారు పడతాడు. అయితే, అతని చేయి పట్టుకున్న సౌర్య.. మా అమ్మ మీ కంట పడటం తన అదృష్టం కాదు నా అదృష్టం నా... అనబోయి..డాక్టర్ బాబు అంటుంది. దీంతో అందరూ నిస్చేష్టులవుతారు. దీప సౌర్యను తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. వంటలక్క ఇంటికి వచ్చిన సౌందర్య.. కాపీ దీపకు ఇచ్చి..అసలు ఎందుకు ఎక్కడికి వెళ్ళవు అని ప్రశ్నిస్తుంది.

మొత్తమ్మీద ఈ రోజు ఎపిసోడ్ అంతా దేపను అందరూ ప్రశ్నించడంతో సరిపోయింది. సౌర్య దీపను చూడగానే మాట్లాడిన మాటలు అందరి హృదయాలు ద్రవించేలా ఉంటాయి. సెంటిమెంట్ డ్రామాగా సాగనున్న ఈరోజు కార్తీకదీపం ఎపిసోడ్ మాటీవీ లో సాయంత్రం చూడండి.

గతంలో జరిగిన కథ ఇదీ..

కార్తీక్, దీప భార్యాభర్తలు. వారిద్దరి అన్యోన్యత చెడగొట్టాలని అప్పటికే కార్తీక్ను ప్రేమించి దక్కిన్చుకోలేకపోయిన మౌనిత భావిస్తుంది. అందుకు కొన్ని ఎత్తుగడలు వేస్తుంది. దాంతో కార్తీక్, దీప విడిపోయి విడివిడిగా జీవిస్తుంటారు. వారికి ఇద్దరు కవల పిల్లలు. సౌర్య.. హిమ. విడివిడిగా ఉంటున్న కార్తీక్, దీపల దగ్గర చెరొక పాప ఉంటారు. సౌర్య తల్లి దగ్గర ఉంటె, హిమ తండ్రి దగ్గర ఉంటుంది. వంటలక్కగా అందరికీ వంటలు చేసి క్యారేజీలు పంపిస్తూ సౌర్యను చదివించుకుంటూ ఉంటుంది ఆత్మాభిమానం గల దీప. మరోవైపు డాక్టర్ బాబుగా కార్తీక్ హిమకు ఎ లోటూ లేకుండా చూసుకుంటాడు. చాలా కాలం బాగానే నడిచింది. అయితే, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాకా.. సమస్యలు మొదలవుతాయి. సౌర్య నాన్న ఎవరు అని అడిగితె, హిమ అమ్మ కావాలని మారం మొదలు పెడుతుంది. ఈ క్రమంలో సౌర్యకు నాన్న ఎవరో తెలుస్తుంది. కానీ, హిమ కు తల్లి ఎవరో తెలీదు. ఇక తన పుట్టినరోజుకు అమ్మను చూపించాలని కార్తీక్ ను హిమ కోరుతుంది. ఆమె ఒత్తిడిని భరించలేని కార్తీక్ చనిపోయిన తన పాత ప్రేయసి ఫోటోను చూపించి ఆమె హిమ తల్లి అని చెబుతాడు. దీంతో దీప హతాశురాలవుతుంది. పుట్టినరోజు పార్టీ నుంచి అకస్మాత్తుగా వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి సౌర్య తన తల్లి వంటలక్క కోసం బాధపడుతూనే ఉంది. మరోవైపు కార్తీక్ మనసులో దీప మీద విషబీజాలు మరింత నాటడానికి మౌనిక ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటివరకూ జరిగింది ఇదీ..

ఇంటిల్లపాది మనసునూ దోచుకున్న కార్తీక దీపం సీరియల్ ప్రతిరోజూ స్టార్ మా టీవీలో వస్తోంది. అదేవిధంగా హాట్ స్టార్ లో ఈ సీరియల్ ఎపిసోడ్ లు అన్నీ అందుబాటులో ఉన్నాయి. అనుబంధాలు.. అనుమానాల మధ్య నలిగిపోయిన భార్యాభర్తలు.. విడివిడిగా ఉంటున్న తల్లి దండ్రుల మధ్య నలిగిపోతున్న పిల్లలు.. మంచిని చేడుగా మర్చగలిగే చెప్పుడుమాటలు చేసే అపకారం అన్నిటినీ కలబోసి అందిస్తోంది కార్తీక దీపం. మానవ బంధాల మధ్య ఉండే సున్నిత విషయాలను చక్కగా చూపిస్తున్న కార్తీక దీపం సీరియల్ మీరూ మిస్ కాకుండా చూసి ఎంజాయ్ చేయండి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories