Sonu Sood Viral Video: దుర్గం చెరువు బ్రిడ్జిపై సోనూసూద్.. ఎందుకో తెలుసా?

Sonu Sood Viral Video: రియల్ హీరోగా మారిన సోనూసూద్.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రంలో నటిస్తున్నారు.

Venkata Chari
Published on: 14 April 2021 6:22 PM IST
Sonu Sood Went on a Bicycle to Megastar Chiranjeevis Aacharya Movie Sets
X
సోనూసూద్ (ఫొటో ట్విట్టర్)

Sonu Sood Viral Video: రియల్ హీరోగా మారిన సోనూసూద్.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రంలో నటిస్తున్నారు. ఎంతో మందికి సహాయం చేస్తూ.. రీల్ మ్యాన్.. రియల్ హీరోగా మారిన సంగతి తెలిసిందే.

అయితే, ఈ రోజు(బుధవారం, ఏప్రిల్ 14న) హైటెక్ సిటీ రోడ్లపై సైకిల్ తొక్కుతూ కనిపించాడు సోనూసూద్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కారణం ఏంటంటే.. ఉదయాన్నే షూటింగ్ ఉండటంతో.. సైకిల్ పై ఆచార్య షూటింగ్ కి బయలు దేరాడంట ఈ రియల్ హీరో. సైక్లింగ్ అంటే ఇష్టపడే సోనూసూద్.. దానిపైనే షికారు చేస్తూ.. హైటెక్ సిటీ, దుర్గమ్మ చెరువు బ్రిడ్జీ మీదుగా షూటింగ్ స్పాట్‌కి చేరుకున్నారు. సైకిల్ పై ఆయన్న చూసిన వాహనదారులు షాక్ అయ్యారు. చాలా వాహనాలు ఆయన్ని ఫాలో చేశాయి.

కాగా, ఆచార్య షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాను మే 13న విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావంతో ఇప్పటికే లవ్‌స్టోరీ, టక్ జగదీష్ సినిమాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆచార్య కూడా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి, కొర‌టాల శివ కాంబోలో వస్తోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ సిద్ధ అనే పాత్రలో కనిపిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే, సోనూసూద్ తదితరులు నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.


Venkata Chari

Venkata Chari

Next Story