Sonu Sood To Fly 39 Children : 39 మంది చిన్నారుల కోసం సోనూసూద్‌ ప్రత్యేక విమానం

Sonu Sood To Fly 39 Children : లాక్ డౌన్ సమయంలో వలసకూలీలను ఆదుకోవడానికి ఎంతోమంది ముందుకు వచ్చారు అందులో బాలీవుడ్ నటుడు

Krishna
Published on: 14 Aug 2020 3:40 PM IST
Sonu Sood To Fly 39 Children : 39 మంది చిన్నారుల కోసం సోనూసూద్‌ ప్రత్యేక విమానం
X
sonusood (File Photo)

Sonu Sood To Fly 39 Children : లాక్ డౌన్ సమయంలో వలసకూలీలను ఆదుకోవడానికి ఎంతోమంది ముందుకు వచ్చారు అందులో బాలీవుడ్ నటుడు సోనుసూద్ ఒకరు.. వారిని వారివారి స్వస్థలాలకు చేర్చి వారి పాలిట సోనూసూద్‌ దేవుడుగా నిలిచాడు. ఇప్పుడు కష్టం అనే మాట వస్తే చాలు అక్కడ వాలిపోతున్నాడు సోనూసూద్‌.. లాక్ డౌన్ సమయంలోనే కాదు.. ఇప్పటికీ ఎవరికీ ఏ సమస్య వచ్చిన ఆదుకోవడానికి ముందుకు వస్తున్నాడు.. నిజానికి సోనుసూద్ సినిమాల్లో విలన్ అయినప్పటికీ అంద‌రి దృష్టిలో ఇప్పుడు రియల్ హీరో... దీనితో ఇప్పుడు ఎక్కడ చూసిన, విన్నాగాని సోనూసూద్‌ పేరే వినిపిస్తుంది.

ఇక తాజగా లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ అవసరమైన 39మంది చిన్నారుల కోసం ఫిలిప్సీన్స్‌ నుంచి ఢిల్లీకి ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించాడు సోనుసూద్.. ఈ విమానం నేడు మ‌నీలా నుండి బ‌య‌లుదేరి మ‌రో రెండు రోజుల‌లో ఢిల్లీ చేరుకోనుంది. ఈ 39మంది చిన్నారులు లివర్‌ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు.. అయితే వీరికి ఢిల్లీలో శస్త్ర చికిత్స చేయాల్సి ఉంది. ప్రస్తుతం వారు వైద్యం చేయించుకోలేని పరిస్థితిలో ఉండడంతో ట్విటర్‌ వేదికగా సోనూసూద్‌ కి తమ పరిస్థితిని వెల్లడించారు.

దీనిపైన వెంటనే స్పందించినసోనుసూద్ 'ఈ అమూల్యమైన జీవితాలను కాపాడుదాం. మరో రెండు రోజుల్లో వాళ్లు ఇండియాకు వస్తారు. 39 ఏంజెల్స్‌ మీరు మీ బ్యాగ్‌లు సర్దుకోండి అంటూ ట్వీట్ చేశాడు సోనుసూద్.. మరో గొప్ప పనితో ముందుకు వచ్చిన సోనుసూద్ ను నెటిజన్లు అభినందిస్తున్నారు.



Krishna

Krishna

Next Story