సోనూసూద్‌పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

సోనూసూద్‌పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు
x
Highlights

ఆయనను చూస్తే సాయం కూడా సలాం చేస్తుంది. కష్టమని తెలిస్తే తనకు కష్టమైనా కన్నీరు తుడిచే రకం ! ఇలా ఉంటే దేవుడు కాకుండా ఎలా ఉంటాడు చెప్పండి ! అవును అదే...

ఆయనను చూస్తే సాయం కూడా సలాం చేస్తుంది. కష్టమని తెలిస్తే తనకు కష్టమైనా కన్నీరు తుడిచే రకం ! ఇలా ఉంటే దేవుడు కాకుండా ఎలా ఉంటాడు చెప్పండి ! అవును అదే అయ్యాడు సోనూసూద్ ! లాక్‌డౌన్‌లో వలస కార్మికులను సొంతూళ్లకు చేర్చడం నుంచి కష్టంలో ఉన్నాం అంటే ఆదుకునే వరకు ప్రతీసారి తన పెద్ద మనసు చూపించారు సోనూ. దీంతో అతని క్రేజ్ ఆకాశాన్ని దాటిపోయింది. జనాలు ఇప్పుడు గుడి కట్టేస్తున్నారు ఏకంగా ! తెలంగాణకు చెందిన ఓ అభిమాని సోనూకు గుడి కట్టేశాడు. ఇప్పటికీ ఈ వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతుండగా సోనూసూద్‌పై మెగాస్టార్‌ చిరంజీవి ప్రశంసలు గుప్పించారు. ప్రస్తుతం వీళ్లిద్దరు ఆచార్య సినిమా కోసం పనిచేస్తున్నారు. ఈ మధ్యే షూటింగ్ మొదలైంది. చిరు సోనూపై ఓ ఫైటింగ్ సీన్ తీస్తుండగా షూటింగ్‌లో అతన్ని కొట్టడానికి చాలా ఇబ్బంది పడ్డానంటూ చిరు ట్వీట్ చేశారు. చాలామంచివాడివి లక్షల మందిలో ప్రేరణ నింపావ్ అంటూ ప్రశంసలు గుప్పించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories