Sonu Sood Offers Accommodation : ఉద్యోగంతో పాటు ఇల్లు కూడా ఇస్తున్న సోనూసూద్!

Sonu Sood Offers Accommodation : నటుడు సోనూసూద్.. ఇప్పుడు ఎక్కడ చూసిన ఈయన పేరే వినిపిస్తుంది. లాక్ డౌన్ సమయంలో వలసకూలీల

Krishna
Published on: 25 Aug 2020 12:39 PM IST
Sonu Sood Offers Accommodation : ఉద్యోగంతో పాటు ఇల్లు కూడా ఇస్తున్న సోనూసూద్!
X

Sonu Sood

Sonu Sood Offers Accommodation : నటుడు సోనూసూద్.. ఇప్పుడు ఎక్కడ చూసిన ఈయన పేరే వినిపిస్తుంది. లాక్ డౌన్ సమయంలో వలసకూలీల కోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసి వారిని వారివారి స్వస్థలాలకు చేర్చి వారి పాలిట సోనూసూద్‌ దేవుడుగా నిలిచాడు.. అంతటితో తన సేవలను ఆపడం లేదు.. కష్టం అనే మాట వస్తే చాలు అక్కడ వాలిపోతున్నాడు. సమస్య కనిపిస్తే చాలు సొల్యూషన్ లాగా కనిపిస్తున్నాడు. సినిమాల్లో కనిపించే విలన్ అయినప్పటికీ ఇప్పుడు అందరికి రియల్ హీరో లాగా కనిపిస్తున్నాడు..

సోనూసూద్ తాజాగా 20 వేల మందికి ఢిల్లీ సమీపంలోని నోయిడాలో ఆశ్రయం కల్పించనున్నట్లు సోమవారం తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ద్వారా ప్రకటించారు.ప్రవాసీ రోజ్‌గార్‌ ద్వారా 20 వేల మంది కూలీలకు గార్మెంట్‌ ఫ్యాక్టరీల్లో ఉపాధి దొరికిందని, ఇప్పడు వారికీ వసతి సౌకర్యం కల్పించడం ఆనందంగా ఉందని అన్నాడు..ఈ మంచి పని కోసం అందరం కష్టపడ్డామని, ఎన్‌ఏఈసీ అధ్యక్షుడు లలిత్‌ ఠుక్రాల్‌ ఎంతో సాయం చేశారని, కార్మికులందరికీ ఆరోగ్యకరమైన వాతావరణంలో వసతి కల్పిస్తామని సోనూసూద్‌ హామీ ఇచ్చారు. వలస కార్మికులకు ఉపాధి కల్పించేందుకు సోనూసూద్ ప్రవాసీ రోజ్‌గార్‌ అనే వెబ్ సైట్, యాప్ ని ప్రారభించిన సంగతి తెలిసిందే..


Krishna

Krishna

Next Story