తన ఆస్తులను తాకట్టు పెట్టిన సోనూసూద్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న న్యూస్

Arun Chilukuri
Published on: 9 Dec 2020 9:01 PM IST
తన ఆస్తులను తాకట్టు పెట్టిన సోనూసూద్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న న్యూస్
X

మంచితనానికి అంబాసిడర్‌గా మారిన సోనూసూద్‌కు సంబంధించిన న్యూస్ ఒకటి ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఆపదలో ఉన్న వారికి సాయం చేసేందుకు తన ఆస్తులను సోనూ తాకట్టు పెట్టారన్న ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. 10 కోట్ల రూపాయల విరాళం పోగు చేసేందుకు.. ముంబై జుహూలోని తన ఎనిమిది ఆస్తుల్ని తాకట్టు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇందులో రెండు షాప్‌లు, ఆరు ఫ్లాట్లు ఉన్నాయని కూడా నెటిజన్లు లెక్కలు చెప్తున్నారు. దీనికి సంబంధించి సెప్టెంబరు 15న అగ్రిమెంట్లపై సంతకం చేశారని... నవంబరు 24న రిజిస్ట్రేషన్‌ జరిగిందని అంటున్నారు. మనసుకు ముసుగులేని తిరుగుతున్న మనుషుల మధ్య.. కష్టం అంటే చాలు ఇలా కష్టపడి సంపాదించిన ఆస్తులను తాకట్టు పెట్టే వాళ్లు ఉంటారా ! అందుకే సోనూసూద్ నిజమైన బంగారం అంటూ నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story