Sonu Sood: శివశంకర్ మాస్టర్‌కు అండగా సోనూసూద్

Sonu Sood: ఇప్పటికే శివశంకర్ కుటుంబసభ్యులతో మాట్లాడినట్లు తెలిపిన సోనూసూద్

Sandeep Eggoju
Updated on: 25 Nov 2021 1:04 PM IST
Sonu Sood Helping to Siva Sankar Master
X
శివ శంకర్ మాస్టర్కు అండగా సోను సూద్ (ఫైల్ ఇమేజ్)

Sonu Sood: కరోనా మహమ్మారి ఇంకా వెంటాడుతూనే ఉంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనా బారిన పడగా ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ఇప్పటికే ఆయన ఊపిరితిత్తులకు 75 శాతం ఇన్‌ఫెక్షన్ సోకిందని వైద్యులు వెల్లడించారు. ఇలాంటి తరుణంలో హెల్పింగ్ స్టార్ సోనూసూద్ శివ శంకర్ మాస్టర్ ఫ్యామిలీకి సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా సోనూసూద్ తన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తాను ఇప్పటికీ శివశంకర్ మాస్టర్ ఫ్యామిలీతో టచ్‌లో ఉన్నానని వారిని కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాని తెలిపారు. ఆందోళన అవసరం లేదని ట్వీట్ చేశారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story