Acharya Movie: సోనూసూద్ కు షాక్ ఇచ్చిన ఆచార్య

Acharya Movie: సోనూసూద్ కు షాక్ ఇచ్చిన ఆచార్య

Arun Chilukuri
Updated on: 2 May 2022 12:38 PM IST
Sonu Sood Disappointed With Acharya Movie
X

Acharya Movie: సోనూసూద్ కు షాక్ ఇచ్చిన ఆచార్య

Acharya Movie: ఆచార్య లో చిరంజీవి ,రామ్ చరణ్ లతో పాటు సోనూసూద్ కు ప్రాధాన్యత ఉన్న పాత్ర ఉందని చెప్పి కొరటాల శివ అతన్ని నటింపచేశారు.‌ సోనూ పై అందుకు తగ్గట్టు చాలా సన్నివేశాలను కూడా కొరటాల చిత్రీకరించారట..‌అయితే, ఎప్పుడయితే చరణ్ పాత్ర నిడివి ని పెంచాలని చిరంజీవి ఫిక్స్ అయ్యారో..‌సోనూ సూద్ రోల్ ను కూడా క్రమంగా ఎడిటింగ్ లో తీసేశారని తెలుస్తోంది. ‌

ఆచార్య కథ ,మేకింగ్ అలానే పాత్ర ను మలిచిన తీరు ను చూసుకుని, ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని సోను సూద్ భావించారు. సినిమా రిలీజ్ తర్వాత హైదరాబాద్ కు వచ్చి ఇంటర్యూస్ చేయాలని కూడా ప్లాన్ చేసుకున్నాడు. కానీ ఎప్పుడయితే ముంబై లో సినిమాను చూశాడో, సోనూ కు పెద్ద షాక్ తగిలింది. ‌తన రోల్ కు అంతగా ఇంపార్టెన్స్ లేకుండా చేయటం పట్ల చాలా నిరాశ చెందాడు.

సినిమాకు మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ రావటంతో, హైదరాబాద్ టూర్ ను క్యాన్సిల్ చేసుకున్నాడట. ఆచార్య విడుదల రోజు చిరంజీవి , చరణ్ లతో పాటు, సోనూ కు ఆయన అబిమానులు భారీ కటౌట్ కట్టి మరీ హాడావుడి చేశారు.మొత్తానికి పూర్తిగా పోయిన కాజలే కాదు.‌అక్కడక్కడా ఉన్నా సోనూసూద్ ను కూడా ఆచార్య చిత్రం హర్ట్ చేసింద్నమాట.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story