సీతారామ ప్రాజెక్టు పనులను పరిశీలించిన స్మితాసబర్వాల్

admin1
Updated on: 17 Nov 2019 4:23 PM IST
Smitasabarwal
X
Smitasabarwal

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సర్కారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు పనులను సీఎం కార్యదర్శి స్మితాసబర్వాల్ పరిశీలించారు. అశ్వాపురం మండలం బీజీకొత్తూరులో ప్రాజెక్టు పనులను పరిశీలించారు. సీతారామ ప్రాజెక్టు ఫేజ్-1 పంప్‌హౌస్ నిర్మాణ పనులు పరిశీలించి అనంతరం పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నల్గొండ, వరంగల్‌ జిల్లాలో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించేలా దీనిని నిర్మిస్తున్నట్లు తెలిపారు.

admin1

admin1

Next Story