Varun Doctor: రికార్డు సృష్టించిన "వరుణ్ డాక్టర్"

Varun Doctor: అదిరిపోయే కలెక్షన్లతో వంద కోట్ల క్లబ్ లో చేరిన "వరుణ్ డాక్టర్"

admin1
Published on: 2 Nov 2021 9:00 PM IST
SivaKarthikeyan Varun Doctor Movie Joins Hundred Crore Club
X

అదిరిపోయే కలెక్షన్స్ తో వరుణ్ డాక్టర్ సినిమా వంద కోట్ల క్లూబ్ లో చేరింది (ఫైల్ ఇమేజ్)

Varun Doctor: కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటించిన "డాక్టర్" అనే తమిళ సినిమా "వరుణ్ డాక్టర్" అనే టైటిల్ తో తెలుగులో కూడా విడుదలైంది. ఈమధ్యనే థియేటర్ లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన మొదటి రోజునుండి అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఇప్పుడు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఈమధ్యనే ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరబోతున్నట్టు ఇంతకుముందే వార్తలు వినిపించాయి. తాజాగా ఆ రికార్డ్ ను కూడా అందుకుంది "వరుణ్ డాక్టర్". ఈమధ్యనే కలెక్షన్ల పరంగా వంద కోట్ల క్లబ్ లో చేరిపోయి విజయ పతాకాన్ని ఎగరువేసింది.

కేవలం పన్నెండు రోజుల్లోనే ఈ సినిమా 50 కోట్ల వరకు వసూలు చేసింది. ఇక అదే జోరుతో ముందుకు సాగిన "వరుణ్ డాక్టర్" ఇప్పుడు వంద కోట్ల క్లబ్లో జాయిన్ అయ్యింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత వంద కోట్ల క్లబ్ లో చేరిన మొదటి సినిమా గా "డాక్టర్" రికార్డ్ సృష్టించింది. "జెంటిల్ మాన్" ఫేమ్ ప్రియాంక అరుల్ మోహన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. నయనతార హీరోయిన్ గా నటించిన "కోకో కోకిల" సినిమాకి దర్శకత్వం వహించిన నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహించారు.

admin1

admin1

Next Story