Breaking News: సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూత..

Sirivennela Seetharama Sastry Passed Away
x

Breaking News: సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూత..

Highlights

Sirivennela Seetharama Sastry : సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.

Sirivennela Seetharama Sastry : సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎంతో మంది ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. రీసెంట్‌గా ప్రముఖ నృత్య దర్శకుడు శివ శంకర్ మాస్టర్ కన్నుమూసిన కొన్ని రోజులకే సీతారామశాస్త్రి కన్నుమూయడం అత్యంత విషాదకరం. గత నెల 24న న్యూమెనియాతో ఆయన హైదరాబాద్‌లోని కిమ్స్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 66 యేళ్లు.

ఇక తన సాహిత్యంతో పాటకు ప్రాణం పోస్తారు సిరివెన్నెల.. "విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం" అంటూ మొదలన ఆయన పాటల ప్రయాణం నిర్విరామంగా కొనసాగింది. మొదటి సినిమాతోనే తనలోని సరస్వతిని దర్శక దిగ్గజం కళాతపస్వి కె విశ్వనాథ్ కు పరిచయం చేసారు సిరివెన్నెల. ఆ సినిమాలో ఆయన రాసిన పాటలన్నీ ఆణిముత్యాలే.. అలాగే రుద్రవీణ సినిమాలో నమ్మకు నమ్మకు ఈ రేయినీ అనే పాట .. లలిత ప్రియ కమలం విరిసినదీ అనే పాటలను అద్భుతంగా రాసారు సిరివెన్నెల. లలిత ప్రియా కమలం పాటకు గాను జాతీయ అవార్డును కూడా అందుకున్నారు.

1986లో సిరివెన్నెల చిత్రంతో గేయ రచయితగా పరిచయమయ్యారు. అలా సిరివెన్నెల ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. సిరివెన్నెల చిత్రానికి గాను ఆయన ఉత్తమ లిరిసిస్ట్ గా నంది అవార్డు అందుకున్నారు. శృతిలయలు, స్వర్ణ కమలం, గాయం, శుభలగ్నం, సింధూరం, చక్రం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి ఎన్నో చిత్రాలకు సిరివెన్నెల నంది అవార్డులు సొంతం చేసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories