సూర్య డైరెక్టర్ తో చేతులు కలపనున్న శింబు

సూర్య డైరెక్టర్ తో చేతులు కలపనున్న శింబు
సూర్య డైరెక్టర్ తో చేతులు కలపనున్న శింబు
Silambarasan: కోలీవుడ్ లో స్టార్ హీరో అయిన శింబు తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచితుడే. ఈ మధ్యనే వెంకట్ ప్రభు దర్శకత్వంలో "మానాడు" అనే ఒక యాక్షన్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా రైట్స్ ను ఈ మధ్యనే టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ వారు సొంతం చేసుకున్నారు. అయితే తాజాగా మరోవైపు శింబు ఒక ప్రముఖ డైరెక్టర్ తో చేతులు కలపనునట్టు సమాచారం. ఈ మధ్యనే సూర్య హీరోగా నటించిన "సూరారై పొట్రు" అనే సినిమాలో మంచి పేరు తెచ్చుకున్నారు సుధ కొంగర.
"ఆకాశమే నీ హద్దురా అనే టైటిల్తో తెలుగులో కూడా విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఇప్పుడు శింబు హీరోగా సుధ కొంగర దర్శకత్వంలో ఒక సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. మరి చూస్తూ ఉంటే శింబు మరొక బ్లాక్ బస్టర్ హిట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేటట్టు కనిపిస్తున్నారు
పెళ్లి కాలేదని నమ్మించి రెండో పెళ్లి.. మొదటి భార్య పాత్ర..
25 Jun 2022 9:49 AM GMTతండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
25 Jun 2022 7:28 AM GMTప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి
25 Jun 2022 5:43 AM GMTCM Jagan: సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం
24 Jun 2022 6:43 AM GMTకేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై రాజకీయ దూమారం.. అసలు ఎవరీ స్వప్న సురేష్?
23 Jun 2022 11:15 AM GMTసికింద్రాబాద్ అల్లర్ల కేసులో కీలక పరిణామం.. విధ్వంసం రోజు..
23 Jun 2022 10:41 AM GMTAfghanistan: ఆఫ్ఘనిస్తాన్లోని పక్టికా రాష్ట్రంలో భారీ భూకంపం
22 Jun 2022 10:01 AM GMT
హైదారబాద్‌లో తల్వార్, కత్తులతో యువకుల హంగామా
26 Jun 2022 7:43 AM GMTMekapati Vikram Reddy: ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ ఘన విజయం
26 Jun 2022 7:19 AM GMTఎల్ బీనగర్ నియోజకవర్గంలో సామ రంగారెడ్డి పర్యటన
26 Jun 2022 6:51 AM GMTBandi Sanjay: జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు బండి సంజయ్ ఫిర్యాదు
26 Jun 2022 6:35 AM GMTLIC Policy: ఎల్ఐసీ సూపర్ టర్మ్ ప్లాన్.. 50 లక్షల ప్రయోజనం..!
26 Jun 2022 6:30 AM GMT