SIIMA: సైమా లో టాలీవుడ్ సినిమాల జోరు..

SIIMA Awards Nominations: సౌత్ సినీ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకమైన సైమా అవార్డుల ప్రధానోత్సవం వచ్చే నెల 10, 11 వ తేదీలో భారీ స్థాయిలో జరగనుంది.

Arun Chilukuri
Updated on: 17 Aug 2022 5:30 PM IST
SIIMA Awards 2022 Nominations List
X

SIIMA: సైమా లో టాలీవుడ్ సినిమాల జోరు..

SIIMA Awards Nominations: సౌత్ సినీ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకమైన సైమా అవార్డుల ప్రధానోత్సవం వచ్చే నెల 10, 11 వ తేదీలో భారీ స్థాయిలో జరగనుంది. ఈ నేపథ్యంలో సైమా వేదికగా తలపడనున్న నటీనటులు, సినిమాల తాలూకా జాబితా బుధవారం నాడు విడుదలైంది. ఇక తెలుగు ఇండస్ట్రీ నుంచి సైమా అవార్డులకి ఎంపికైన సినిమాల జాబితా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

అన్నిటికంటే ఎక్కువ నామినేషన్లతో ఈ జాబితాలో చేరిన మొట్టమొదటి తెలుగు సినిమా "పుష్ప" కావడం విశేషం. 12 నామినేషన్లతో "పుష్ప: ది రైజ్" సైమా అవార్డులలో పాల్గొననుంది. ఇక బాలకృష్ణ హీరోగా నటించిన "అఖండ" సినిమాకు 10 నామినేషన్లు రాగా, నవీన్ పోలిశెట్టి రాహుల్ రామకృష్ణ మరియు ప్రియదర్శి నటించిన బ్లాక్ బస్టర్ సినిమా "జాతి రత్నాలు" సినిమాకి ఎనిమిది నామినేషన్లు దక్కాయి.

ఇక మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన "ఉప్పెన" సినిమా కూడా 8 నామినేషన్లతో సైమా అవార్డులలో పాల్గొనబోతోంది. ఇక ఈసారి బెస్ట్ సినిమా అవార్డు ఈ ఐదు సినిమాల్లో ఏ సినిమాకి దక్కనోందో ఇంకా తెలియాల్సి ఉంది. ఇక తమిళ్ నుంచి కర్ణన్‌, డాక్టర్, మాస్టర్‌, తలైవి సినిమాలు నామినేషన్ల లో ఉండగా మలయాళం నుంచి మిన్నల్‌ మురళీ, కురుప్, మాలిక్‌, జోజీ సినిమాలు, మరియు కన్నడ నుంచి రాబర్ట్‌, గరుడ గమన వృషభ వాహన, యువరత్న సినిమాలు నామినేషన్లలో ఉన్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story