Sidharth Malhotra: గ్రీన్ ఇండియా ఛాలెంజ్'లో పాల్గొన్న సిద్ధార్థ్ మల్హోత్రా

Sidharth Malhotra: ముంబైలో భాగంగా మొక్క నాటిన సిద్ధార్థ్..

Sandeep Eggoju
Updated on: 27 Nov 2021 2:43 PM IST
Sidharth Malhotra Participated in Green India Challenge
X

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్క నాటిన  సిద్ధర్థ్ మల్హోత్రా 

Sidharth Malhotra: వృక్షో రక్షతి రక్షితా అన్న పెద్దల మాటలే ఈ సృష్టిని కాపాడుతాయని ప్రజల్లో ప్రకృతి చైతన్యం కలిగిస్తుంది గ్రీన్ ఇండియా ఛాలెంజ్. అందుకే, ప్రతినిత్యం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఓ చోట "గ్రీన్ ఇండియా ఛాలెంజ్" నినాదం వినిపిస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగా బాలీవుడ్ యంగ్ స్టార్ సిద్ధార్థ్ మల్హోత్రా గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్నారు.

ముంబాయిలోని, అందేరి వెస్ట్ చిత్రకూట్ స్టూడియోలో తన తాజా సినిమా యోధ చిత్రీకరణలో పాల్గొంటున్న సిద్ధార్థ్ సినిమా డైరెక్టర్లు సాగర్ అంబ్రే, పుష్కర్ ఓజాతో కలిసి మొక్కలను నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి తెలసుకున్న వెంటనే స్వయంగా మొక్కలు నాటడం విశేషం. అంతేకాదు, సినిమా ముహూర్తానికి ముందే మొక్కలు నాటి ఒక అద్భుతమైన సంప్రదాయానికి తెరతీసారు డైరెక్టర్లు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story