పవర్ స్టార్ కు పాట పాడిన సిద్ధ్ శ్రీరామ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే . దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సినిమా షూటింగ్ మొదలు అనేక రకాల గాసిప్స్ ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు గాను పవన్ కళ్యాణ్ కి 50 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ లో అమితాబ్ నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు తెలుగులో పవన్ తో దీనిని నిర్మిస్తున్నారు.
తమన్ సంగీత దర్శకత్వం లో ఈ సినిమాలో సిధ్ శ్రీరామ్ ఒక ప్రత్యేక గీతాన్ని ఆలపిస్తూ ఉన్నట్టు తెలుస్తోంది. చాలా రోజులుగా ఈ విషయంపై ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆ ప్రచారం అంతా నిజమే నంటూ తమన్ క్లారిటీ ఇచ్చేశాడు. తమ అధికారిక ఖాతాలలో తమన్ ఈ విషయంపై ఒక ట్వీట్ చేశారు. "మేమిద్దరం మళ్లీ కలిసాం. ఇన్నాళ్లు మీరు ఊహించుకున్న దంతా నూరుశాతం నిజమే. పవన్ కళ్యాణ్ సినిమాలో ఓ పాటను శ్రీరామ్ పాడపోతున్నారు. ప్రాణం పెట్టి ఈ పాటను కంపోజ్ చేశాం. మీకు ఈ పాటను ఎప్పుడెప్పుడు వినిపిస్తానని ఎదురుచూస్తున్నా." అంటూ అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. దాంతోపాటు సిద్ శ్రీరామ్ తో కలిసి దిగిన ఫోటోను కూడా ఆయన షేర్ చేశారు.
కాగా, ఈ సినిమాకు లాయర్ సాబ్, వకీల్ సాబ్ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ సినిమా కథ ప్రకారం ముగ్గురు హీరోయిన్లు ఈ సినిమాలో ఉంటారు. వారిలో ఇద్దరు హీరోయిన్స్ ఇప్పటికే ఫైనలైజ్ అయినట్లు తెలుస్తోంది. ప్రగ్యజైస్వాల్, అనసూయ భరద్వాజ్ ఇద్దరూ ఈ సినిమాకి కీలకమైన పాత్రల్లో నటిస్తున్నారు అంటున్నారు. ఈ సినిమాను మేలో విడుదల చేయాలని దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత చేస్తున్న మొదటి సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సిద్ద్ శ్రీరామ్ - తమన్ కాంబినేషన్లో వచ్చిన కొన్ని పాటలు యూట్యూబ్ ను షేక్ చేసిన విషయం తెలిసిందే.ఇక పవన్ కళ్యాణ్ కు సిద్ది శ్రీరామ్ పాడబోయే పాట ఎలా ఉంటుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
All ur guesses r 99.9% right !! @sidsriram sings for #PSPK26 !!
— thaman S (@MusicThaman) February 12, 2020
Hope u all like it
We have put our heart & soul for this @SVC_official
My love to #dilraju gaaru #VenuSriRam gaaru @ramjowrites !! For this song
Can't wait for u guys to listen this !! 🔊
♥️ pic.twitter.com/BwUAlwXnJo




