ఇన్నాళ్లకు శృతి హాసన్ కల నెరవేరింది

Ruthvik
Published on: 28 Jan 2019 4:06 PM IST
ఇన్నాళ్లకు శృతి హాసన్ కల నెరవేరింది
X

విలక్షణ నటుడు కమల్ హాసన్ కూతురు గా ఇండస్ట్రీకి పరిచయమైన శృతిహాసన్ మొదటి నుండి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తూనే వచ్చింది. హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె గత కొంత కాలంగా సినిమాలకు దూరం అయిన సంగతి తెలిసిందే. నటిగానే కాక సంగీత దర్శకురాలిగా మరియు గాయనిగా కూడా తన ప్రతిభను శృతిహాసన్ చాటింది. భారత దేశంలోనే కాక ఇతర దేశాల్లో కూడా సంగీత కచేరీలు ఇచ్చింది. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన లండన్ ట్రవ్ బడూర్ ప్రాంగణంలో సంగీత కచేరి ఇవ్వాలని శృతి హాసన్ కల.

మొత్తానికి తన కలను నిజం చేసుకుంది. తాజాగా లండన్లోని ట్రవ్ బడూర్ లో సంగీత కచేరీ చేసిన శృతి తనకు చాలా సంతోషంగా ఉందని ఇప్పటివరకు వందకు పైగా కచేరీలు చేసిన తనకు ఈ కచేరి సంతృప్తిని కలిగించిందని వెల్లడించింది. ఇక ఈమెకు మంచి సినిమా ఆఫర్ వస్తే మళ్ళీ హీరోయిన్ గా నటించేందుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఈమెను మళ్ళీ తెరపై చూడాలని ఫ్యాన్స్ ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. సినిమాలు పక్కన పెడితే అమెరికాలోనే త్వరలో మరొక కచేరి చేసేందుకు సిద్ధమవుతోంది శృతి.

Ruthvik

Ruthvik

Next Story