Shruti Haasan In Vakeel Saab Movie: వకీల్ సాబ్ హీరోయిన్ ఫిక్స్ ఆయింది.. క్లారిటీ ఇచ్చిన మెగా బ్యూటీ!

Shruti Haasan In Vakeel Saab Movie: రాజకీయాలతో రెండేళ్ళు బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. అందులో భాగంగా అయన రీఎంట్రీ మూవీగా వకీల్ సాబ్ తెరకెక్కుతుంది.
Shruti Haasan In Vakeel Saab Movie: రాజకీయాలతో రెండేళ్ళు బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. అందులో భాగంగా అయన రీఎంట్రీ మూవీగా వకీల్ సాబ్ తెరకెక్కుతుంది .ఇది పవన్ కి 26 వ చిత్రం కావడం విశేషం.. హిందీలో వచ్చిన పింక్ సినిమాకి ఇది రీమేక్ ..ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటుగా అంజలి, నివేతా థామస్, అనన్య పాండే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకి ఓ మై ఫ్రెండ్ ఫేం వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, బోనీ కపూర్, దిల్ రాజుకలిసి సంయుక్తంగా సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.. కరోనా వైరస్ ప్రభావం వలన సినిమా షూటింగ్ ప్రస్తుతానికి వాయిదా పడింది.
అయితే ఈ సినిమాలో పవన్ పక్కన నటించే హీరోయిన్ ఎవరు అనే చర్చ ఎప్పటినుంచో నడుస్తుంది.. ఇప్పటికే తమన్నా, లావణ్య త్రిపాఠి, శ్రుతి హాసన్ పేర్లు వినిపించాయి. కానీ చిత్రబృందం దీనిపైన ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే శృతిహాసన్ తాజాగా దీనిపైన స్పందించింది. వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్నట్లు స్పష్టం చేసిన శృతి హాసన్ తన పాత్రకు సంబంధించిన వివరాలు వెల్లడించడానికి మాత్రం ఆమె నిరాకరించింది. అయితే శ్రుతి హాసన్‌ది 'పింక్' సినిమాలో తాప్సీ పోషించిన పాత్ర కాదట..
ఇక ఈ సినిమాలో వచ్చే పవన్ ఫ్లాష్ బాక్ ఎపిసోడ్ లో పవన్ భార్య శృతి హాసన్ కనిపించనుందని న్యూస్ చక్కర్లు కొడుతోంది. కానీ దీనిపైన ఎలాంటి అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక ఇప్పటికే పవన్ శృతి హాసన్ కలసి గబ్బర్ సింగ్, కాటమరాయుడు సినిమాలో కలిసి నటించారు.
ఈ సినిమా తర్వాత క్రిష్ డైరెక్షన్లో ఓ సినిమాని పవన్ లైన్ లో పెట్టారు. ఎఎం రత్నం ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక దీని తర్వాత పవన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇక పూరి, త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు పవన్ సిద్దం అయ్యారని తెలుస్తోంది.
PM Narendra Modi: తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోదీ...
3 July 2022 2:09 PM GMTTelangana: శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి తప్పిన ప్రమాదం
3 July 2022 2:00 PM GMTకళాకారుల డప్పు చప్పుళ్లు, నృత్యాల నడుమ వేదికపైకి ప్రధాని మోదీ
3 July 2022 1:44 PM GMTPawan Kalyan: ప్రభుత్వ పథకాల్లో చాలా మందికి కోత పెడుతున్నారు
3 July 2022 1:26 PM GMTAmit Shah: ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణలో అధికారం భాజపాదే
3 July 2022 1:15 PM GMT