పెళ్లిపై రియాక్ట్ అయిన శృతి హాసన్

ఏ హీరోయిన్ అయినా అవకాశాలు తగ్గితే సినిమాలకు దూరం అవుతుంది కానీ కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న శృతిహాసన్ మాత్రం కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగా సినిమాలకు బై బై చెప్పింది.

Ruthvik
Published on: 5 Jan 2019 1:41 PM IST
Shruti Haasan
X
Shruti Haasan

ఏ హీరోయిన్ అయినా అవకాశాలు తగ్గితే సినిమాలకు దూరం అవుతుంది కానీ కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న శృతిహాసన్ మాత్రం కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగా సినిమాలకు బై బై చెప్పింది. పవన్ కళ్యాణ్ తో నటించిన 'కాటమరాయుడు' సినిమా తర్వాత ఆమె మళ్లీ తెర పైన మెరిసింది లేదు. అయితే తనకి బాగా ఇష్టమైన మ్యూజిక్ తో ప్రేక్షకులకు దగ్గరవడానికి ప్రయత్నిస్తుంది కానీ సినిమాలకు దూరం అవడానికి కారణం మాత్రం తన బాయ్ ఫ్రెండ్ మైఖేల్ కార్సల్ అని కొందరు అంటారు.

ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో శృతి మరియు మైకేల్ ఫొటోస్ ఫోటోలను చూసి వీళ్ళు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని మీడియా కోడైకూస్తోంది. ఈ నేపథ్యంలో ఒక తెలుగు వెబ్ సైట్ వారు 2019లో శృతిహాసన్ పెళ్లి చేసుకోబోతోంది అంటూ ఒక పెద్ద ఆర్టికల్ ని రాసేశారు. మామూలుగా ఇలాంటి పుకార్లకు రియాక్ట్ అవ్వని శృతిహాసన్ ఈ ఆర్టికల్ కు మాత్రం రెస్పాండ్ అవ్వడం విశేషం. "నిజంగానా.. అయితే ఇది నాకు న్యూసే" అంటూ సెటైర్ వేసింది శ్రీమంతుడు హీరోయిన్. పెళ్లి మాట ఎత్తక పోయినా ఈ మధ్య ప్రతి ఫోటోలోను శృతిహాసన్ మైకేల్ తోనే కనపడుతోంది. ఇక పెళ్లి పక్కన పెడితే శృతి హాసన్ ఒక బాలీవుడ్ సినిమాకు సైన్ చేసిందని వార్తలు వస్తున్నాయి.

Ruthvik

Ruthvik

Next Story