నా గుండె చప్పుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు : ఆకట్టుకుంటున్న శ్రీయ పోస్ట్ !

K V D Varma
Updated on: 15 April 2020 8:42 PM IST
నా గుండె చప్పుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు : ఆకట్టుకుంటున్న శ్రీయ పోస్ట్ !
X
shriya saran with her husband (from shriya Instagram photos)

శ్రీయ ఈ పేరు తెలీని తెలుగు ప్రేక్షకులు ఉండరు. తన అందాలతో అంతకు మించి చక్కని నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించారు ఆమె. చత్రపతి సినిమాలో ప్రభాస్ సరసన ఆమె చేసిన హంగామా అందరికీ ఎప్పటికీ గుర్తుండి పోతుంది. తెలుగులో అగ్రహీరోలందరి సరసనా ఆమె ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. రజనీకాంత్ శివాజీ సినిమాలో ఆమె మెరిసి మురిపించారు.

ఆమె 2018 మార్చిలో రష్యా టెన్నిస్ ఆటగాడు ఆండ్రియా కోస్చేవ్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వారు ఇద్దరూ ఇటీవల స్పెయిన్ వెళ్ళారు. అయితే, అక్కడ ఆండ్రియా కరోనా వైరస్ లక్షణాలతో బాధపడుతున్నట్టు శ్రీయ రెండు రోజుల క్రితం వెల్లడించారు. దీంతో అందరూ ఉలిక్కి పడ్డారు. ప్రస్తుతం వారిద్దరూ స్పెయిన్ హౌస్ క్వారంటైన్ లో ఉన్నారు.

ఈ నేపధ్యంలో తన భర్త ఆండ్రియా పుట్టినరోజు సందర్భంగా ఆమె ఇన్స్టాగ్రామ్ లో ఒక ఫోటో ఉంచారు. ఇద్దరూ ఒకరికొకరు దగ్గరగా హత్తుకుని ఉన్నట్టు ఉన్న ఆ ఫోటో పోస్ట్ చేసిన శ్రీయ ''నా గుండె చప్పుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు'' అంటూ కామెంట్ పెట్టారు.

ఈ ఫోటోలో తెల్లటి డ్రెస్ లోనూ.. ఆండ్రియా నల్లటి బ్లేజర్ లోనూ ఎంతో క్యూట్ గా ఉన్నారు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఫోటో తో పాటు శ్రీయ పోస్ట్ ఇన్స్టాగ్రామ్ లో విపరీతంగా లైక్ లు తెచ్చిపెడుతోంది.

కాగా, కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్న ఆండ్రియా త్వరగా కోలుకోవాలనీ, శ్రీయ క్షేమంగా ఉండాలనీ ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.


View this post on Instagram

Happy birthday to my heartbeat....

A post shared by Shriya Saran (@shriya_saran1109) on


K V D Varma

K V D Varma

Next Story