Shradhha kapoor Special Song : బన్నీ సినిమాలో సాహో భామ?

Shradhha kapoor Special Song : అల వైకుంఠపురములో సినిమా తర్వాత అల్లు అర్జున్ , సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమాలో నటిస్తున్న

Krishna
Published on: 19 Aug 2020 5:07 PM IST
Shradhha kapoor Special Song : బన్నీ సినిమాలో సాహో భామ?
X
Shradhha kapoor (File Photo)

Shradhha kapoor Special Song : అల వైకుంఠపురములో సినిమా తర్వాత అల్లు అర్జున్ , సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే..ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా సినిమాకు సంబంధించిన టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది చిత్ర బృందం.. ఫస్ట్ లుక్ కమ్ టైటిల్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్పక్ నారాయణగా నటిస్తున్నట్లు సమాచారం..

అయితే సుకుమార్ సినిమా అంటేనే ఐటెం సాంగ్ కచ్చితంగా ఉంటుందని అందరికి తెలిసిందే... అయితే పుష్ప సినిమాలో కూడా ఓ ఐటెం సాంగ్ ని పెట్టేందుకు ప్లాన్ చేశాడట సుకుమార్.. అయితే ఈ ఐటెం సాంగ్ కోసం సుకుమార్ అండ్ టీం బాలీవుడ్ భామ శ్రద్దాక‌పూర్ ని సంప్రదించారని సమాచారం... దీనికి శ్రద్దాక‌పూర్ కూడా ఒకే చెప్పిందని తెలుస్తోంది. కానీ దీనిపైన అధికార ప్రకటన రావాల్సి ఉంది.. ఇక గత ఏడాది ప్రభాస్ హీరోగా, సుజీత్ దర్శకత్వంలో వచ్చిన సాహో సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది శ్రద్దాక‌పూర్..

ఇక సుకుమార్ , అల్లు అర్జున్ కాంబినేషన్లో ఇప్పటివరకూ వచ్చిన ఆర్య, ఆర్య 2 సినిమాలు ఎంత పెద్ద విజయం సాధించాలని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ అవుతూ ఉండడం, తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Krishna

Krishna

Next Story