సంక్రాంతి సందర్భంగా శ్రద్ధ స్వీట్ సర్ప్రైజ్

Saaho
x
Saaho
Highlights

బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'సాహో' సినిమా తో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనున్న సంగతి తెలిసిందే.

బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'సాహో' సినిమా తో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనున్న సంగతి తెలిసిందే. తెలుగు మరియు హిందీ భాషలలో ఒకేసారి తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ గత కొంతకాలంగా రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ప్రస్తుతం సంక్రాంతి సంబరాలను తన కుటుంబంతో పాటు ముంబైలో జరుపుకుంటోంది శ్రద్ధ. ఈ సందర్భంగా ప్రభాస్ మరియు ఇతర 'సాహో' సభ్యులకు బహుమతి ఇచ్చిందట శ్రద్ధ.

మహారాష్ట్ర నుండి అక్కడ బాగా పాపులర్ స్వీట్ అయిన తిల్ గుల్ లడ్డూల బాక్సులను సాహో టీంకు పంపిందట శ్రద్ధ. ఇప్పటికే ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకుంటున్న శ్రద్ధను 'సాహో' టీం మరియు ప్రభాస్ బాగా ఆదరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రభాస్ ప్రత్యేకంగా శ్రద్ధ కోసం హైదరాబాదు వంటలు చేయించి వాటిని షూటింగ్ లొకేషన్ కి తెప్పించి శ్రద్ధకు సర్ప్రైజ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ప్రభాస్ కి అలాంటి స్వీట్ సర్ప్రైజ్ ఇవ్వడం శ్రద్ధ వంతయింది. ఇక 'సాహో' సినిమా ఈ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన విడుదల కానున్న సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories