Stree 2: రికార్డులు తిరగరాస్తోన్న 'స్త్రీ 2'.. అత్యంత వేగంగా ఆ క్లబ్‌లో.. !

'Stree 2' Box Office Collection: నటి శ్రద్ధాకపూర్ లీడ్‌ రోల్‌లో నటించిన 'స్త్రీ2' చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న విషయం తెలిసిందే.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 6 Sept 2024 12:43 PM IST
Shraddha Kapoor Latest Movie Stree 2 Collection Crosses RS 500 Crore
X

Stree 2: రికార్డులు తిరగరాస్తోన్న 'స్త్రీ 2'.. అత్యంత వేగంగా ఆ క్లబ్‌లో.. !

'Stree 2' Box Office Collection: నటి శ్రద్ధాకపూర్ లీడ్‌ రోల్‌లో నటించిన 'స్త్రీ2' చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. రాజ్‌కుమార్‌ రావు హీరోగా అమర్‌ కౌశిక్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రికార్డులను తిరగరాస్తోంది. ఆగస్టు 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల సునామిని సృష్టిస్తోంది. చిన్న సినిమాగా వచ్చిన స్త్రీ2 పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది.

మొదటి రోజే ఏకంగా రూ. 54 కోట్ల కొల్లగొట్టిందీ మూవీ. దీంతో అగ్ర హీరోలకే సాధ్యమైన రేర్‌ ఫీట్‌ను సొంతం చేసుకుంది. ఇక తాజాగా ఈ సినిమా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఏకంగా రూ. 502 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి మరో అరుదైన ఘనత సాధించింది. ఇది కేవలం భారత్‌లోనే కావడం విశేషం. ఓవర్‌సీస్‌ పరంగా చూస్తే ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీంతో బాలీవుడ్‌లో ఈ ఏడాది అత్యంత వేగంగా రూ. 500 కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాగా నిలిచిందీ మూవీ.

శ్రద్ధాకపూర్‌ కూడా అత్యంత కలెక్షన్లు రాబట్టిన హీరోయిన్ల జాబితాలో ముందు వరుసలో దూసుకుపోతోంది. కామెడీ, హారర్‌ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. శ్రద్ధా కపూర్ కెరీర్‌లోనే అత్యంత వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఈ ఏడాది ఇప్పటి వరకు విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో కల్కి 2898ఏడీ మొదటి స్థానంలో ఉండగా స్త్రీ2 రెండో స్థానంలో నిలిచింది. అక్షయ్‌ కుమార్‌, జాన్‌ అబ్రహం వంటి హీరోల సినిమాలను వెనక్కి నెట్టి మరీ స్త్రీ2 రికార్డులను తిరగరాస్తోంది. ఇదిలా ఉంటే మరో రెండు వారాల వరకు బాలీవుడ్‌ మరే పెద్ద సినిమా విడుదల లేకపోవడంతో స్త్రీ2 కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఈ సినిమా మరెన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story