బొంబాయి + సఖి = ఖుషీ.. అన్న కామెంట్స్ నిజమా..?

Shiva Nirvana Making Movies with Mani Ratnams Stories
x

బొంబాయి + సఖి = ఖుషీ.. అన్న కామెంట్స్ నిజమా..?

Highlights

Kushi: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మూవీ ఖుషీ ట్రైలర్ రాగానే, కూల్ గా దాడి చేయబోతున్నాడన్నారు.

Kushi: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మూవీ ఖుషీ ట్రైలర్ రాగానే, కూల్ గా దాడి చేయబోతున్నాడన్నారు. కాని దర్శకుడి మీద మాత్రం ట్రోలింగ్ పెరిగింది. కథల కోసం కష్టపడకుండా సింపుల్ గా మణిరత్నం మూవీలనే మార్చి తీస్తున్నాడంటున్నారు.. కామెంట్లు పెంచారు.. ఇదంతా ట్రైలర్ వచ్చాకే మొదలైంది. సో ఏది నిజం?

ఖుషీ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ తో ఒక్కసారిగా హైప్ పెరిగింది. కాని ట్రైలర్ విడుదలయ్యాకే, ఇది బాంబే మూవీ ప్లస్ సఖీ ఈజ్ ఈక్వల్స్ టూ ఖుషీ అంటున్నారు. మణిరత్నం కథలతో శివనిర్వాణ పండగ చేసుకుంటున్నాడంటున్నారు. బాంబే మూవీలో హీరో బ్రాహ్మిణ్, హీరోయిన్ ముస్లిం.. ఖుషీలో హీరోయిన్ బ్రాహ్మిణ్ హీరో క్రిస్టియన్... అలానే సఖిలో పెళ్లయ్యాక హీరో, హీరోయిన్ల మధ్య తగాదాలు.. తర్వాత ఓ పెద్ద యాక్సిడెంట్ తర్వాత శుభం కార్డ్ పడేలా క్లైమాక్స్... ఖుషీలో కూడా అదే ఫార్ములా వాడాడా అన్న డౌట్లు పెరిగాయి.

శివ నిర్వాణ మణరత్నం ఫ్యాన్ అని మొదటి మూవీ నుంచే అర్ధం చేసుకోవచ్చు. మణిరత్నం మౌన రాగాన్నే రెండు సార్లు ఫ్రీ మేక్ చేశాడన్నారు. నిన్ను కోరి కథ అయితే యాజ్ ఇట్ ఈజ్ దింపేశాడనేశారు.

మౌనరాగంలో హీరోయిన్ తన పెళ్లయ్యాక ప్రేమికుడి కోసం వెతుకుతుంటే, తన భర్త సాయం చేస్తాడు. నిన్నుకోరిలో ప్రేమికుడే తన ప్రేయసికోసం జర్నీ చేస్తే, హీరోయిన్ భర్తే సాయం చేస్తాడు.. ఇలా చిన్న మార్పులతో ఈ తరానికి తగ్గట్టు మణిరత్నం కథల్నే మార్చి నెట్టుకొస్తున్న శివనిర్వాణ అన్నారు. ఖుషీ ట్రైలర్ వచ్చాక మళ్లీ అవే కామెంట్లు పెరిగాయి.

మౌనరాగం తో నిన్ను కోరి మాత్రమే కాదు మజిలీ కూడా తీశాడు శివ నిర్వాణ అన్నారు. అక్కడ భార్య తన ప్రేమికుడి కోసం తపన పడుతుంటే భర్తగా హీరో సాయం చేస్తాడు. మజిలీలో ఈ పాత్ర సమంతతో వేయించి జెండర్స్ మార్చాడు శివ అంతే... ఇది ఇప్పటి వరకు శివనిర్వాణ మూవీల మీద వచ్చిన కామెంట్స్.. ఇవన్నీ ఎలా ఉన్నా ఖుషీలో కథే కాదు, పాటలో కూడా మణిరత్నం మూవీ టైటిల్లను వదల్లేదు శివ నిర్వాణ.

Show Full Article
Print Article
Next Story
More Stories