Sharwanand Wedding: బెస్ట్ ఫ్రెండ్ శర్వా పెళ్లి వేడుకల్లో రాంచరణ్ సందడి

టాలీవుడ్ హీరో శర్వానంద్ _ హర్షిత రెడ్డిల పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి జరిగిన హల్దీ, సంగీత్ వేడుకల్లో శర్వానంద్ బెస్ట్ ఫ్రెండ్ హీరో రాంచరణ్ సందడి చేశారు.

Dhatripriya
Published on: 3 Jun 2023 7:35 PM IST
Sharwanand Wedding: బెస్ట్ ఫ్రెండ్ శర్వా పెళ్లి వేడుకల్లో రాంచరణ్ సందడి
X

Sharwanand Wedding: బెస్ట్ ఫ్రెండ్ శర్వా పెళ్లి వేడుకల్లో రాంచరణ్ సందడి

Sharwanand Wedding: టాలీవుడ్ హీరో శర్వానంద్ _ హర్షిత రెడ్డిల పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి జరిగిన హల్దీ, సంగీత్ వేడుకల్లో శర్వానంద్ బెస్ట్ ఫ్రెండ్ హీరో రాంచరణ్ సందడి చేశారు. రాంచరణ్ తో పాటు అక్కినేని అఖిల్, రానా దగ్గుబాటి కూడా వేడుకల్లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

పెళ్లికూతురు ఎవరంటే:

హీరో శర్వానంద్ తో జీవితం పంచుకోబోతున్న అమ్మాయి రక్షిత రెడ్డి మరెవరో కాదు దివంగత రాజకీయ నాయకులు బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి మనవరాలు. ప్రస్తుతం రక్షిత ఫారిన్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారు. ఈమె తండ్రి మధుసూదన్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో న్యాయవాదిగా పని చేస్తున్నారు.

శర్వానంద్ సినిమాలు:

ఇక శర్వానంద్ విషయానికొస్తే, కెరీర్ తొలినాళ్లల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసినా ప్రస్తుతం హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రన్ రాజా రన్, ఎక్స్ ప్రెజ్ రాజా, శతమానంభవతి, మహానుభావుడు వంటి కమర్షియల్ హిట్స్ అందుకున్నారు. ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story