మార్చ్ నుండి మొదలవనున్న సమంత, శర్వా ప్రేమ కథ

మార్చ్ నుండి మొదలవనున్న సమంత, శర్వా ప్రేమ కథ
x
Highlights

తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష హీరోహీరోయిన్లుగా నటించిన '96' సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఫీల్ గుడ్ లవ్ స్టొరీ గా విడుదలైన ఈ చిత్రం తమిళ...

తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష హీరోహీరోయిన్లుగా నటించిన '96' సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఫీల్ గుడ్ లవ్ స్టొరీ గా విడుదలైన ఈ చిత్రం తమిళ ప్రేక్షకులను బాగానే మెప్పించింది. ఇప్పుడు అదే సినిమా తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సమంత, శర్వానంద్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమిళ వెర్షన్ కి దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమార్ తెలుగు రీమేక్ కి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ మార్చ్ నుండి మొదలవనుంది.

సినిమా చిత్రీకరణ వైజాగ్ లో జరగనున్నట్లు సమాచారం. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమాలో హీరో చిన్నప్పటి పాత్రలు పోషించేందుకు యాక్టర్ ను వెతుకుతున్నాడు దిల్ రాజు. తెలుగు నెటీవీటి కి సూట్ అయ్యేలా కథలో మార్పులు చేస్తున్నాడు దర్శకుడు. షూటింగ్ త్వరగా పూర్తి చేసి ఆగస్టులో ఈ సినిమాను విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తమిళ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన ఈ ప్రేమ కథ తెలుగు ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పిస్తుందో వేచిచూడాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories