Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి ఫిక్స్.. ముహూర్తం, వేడుక.. ఎప్పుడు ఎక్కడ అంటే..?

* యంగ్ హీరో శర్వానంద్ ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ పై వస్తున్న రూమర్స్ కు చెక్ పడింది. * క్షితరెడ్డితో వివాహ ముహూర్తాన్ని శర్వా కుటుంబసభ్యులు అనౌన్స్ చేశారు.

Dhatripriya
Updated on: 17 May 2023 3:42 PM IST
Sharwanand and Rakshita Reddy to tie the knot in Jaipur
X

Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి ఫిక్స్.. ముహూర్తం, వేడుక.. ఎప్పుడు ఎక్కడ అంటే..

Sharwanand Marriage: యంగ్ హీరో శర్వానంద్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. టాలీవుడ్ లో పలువురు సెలబ్రిటీలకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. తాజాగా వెలువడిన వార్తతో శర్వా తనపై వినిస్తున్న గాసిప్స్ కు చెక్ పెట్టినట్టయింది. విషయం ఏంటంటే...ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణ మనవరాలు, తెలంగాణ హై కోర్టు లాయర్ మధుసూదన్ రెడ్డి తనయ రక్షితాతో శర్వానంద్ ఈ ఏడాది జనవరిలో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ అయిందని రూమర్స్ వచ్చాయి. ఇవి వైరల్ గా మారడంతో శర్వా టీమ్ రెస్పాండ్ అయింది. ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ కాలేదని...సినిమాలతో బిజీగా ఉండటం వల్లే గ్యాప్ వచ్చిందని..కమిట్ మెంట్స్ పూర్తయ్యాక మ్యారేజ్ ఉంటుందని క్లారిటీ ఇచ్చింది.

శర్వా టీమ్ క్లారిటీ ఇవ్వడంతో రూమర్స్ కు బ్రేక్ పడగా..తాజాగా శర్వా కుటుంబ సభ్యులు పెళ్లి డేట్ ను అనౌన్స్ చేశారు. జూన్ 2, 3 తేదీల్లో శర్వా-రక్షితల వివాహం గ్రాండ్ గా చేయబోతున్నట్లు ప్రకటించారు. వీరి వివాహానికి రాజస్తాన్ లోని లీలా ప్యాలెస్ వేదిక కానుంది. జూన్ 2న మెహందీ ఫంక్షన్ తో పాటు సాయంత్రం సంగీత్ నిర్వహించనున్నారు. ఇక జూన్ 3న రక్షిత మెడలో శర్వా మూడుముళ్లు వేయనున్నాడు. ఈ పెళ్లికి శర్వానంద్ ఫ్రెండ్స్ రామ్ చరణ్, ఉపాసన దంపతులతో పాటు అక్కినేని కుటుంబం, అలాగే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. ఇప్పటికే వారికి ఆహ్వానాలు కూడా అందాయి.

Dhatripriya

Dhatripriya

Next Story