Raghavendra Rao: రాఘవేంద్రరావు తో జోడీ కట్టనున్న ఆ నటి ఎవరో తెలుసా?

Raghavendra Rao: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సరసన సీనియర్ నటి లక్ష్మీ నటించనున్నట్లు టాలీవుడ్ టాక్.

Kranthi
Published on: 5 Jun 2021 11:02 AM IST
Senior Heroine is Going to Pair up With Raghavendra Rao
X

దర్శకుడు రాఘవేంద్ర రావు (ఫైల్ ఇమేజ్)

Raghavendra Rao: లారీలో నుంచి బత్తాయిలు దొర్లించడం.. హీరోయిన్ బొడ్డు మీద ఆపిల్ తో కొట్టడం.. హీరోతో రివెంజ్ డ్రామా నడిపించడం.. భారీ డైలాగులు చెప్పించం.. యాక్షన్ సన్నివేశాలు రక్తి కట్టించడం.. ఇవన్నీ చేయడంలో ఆరితేరిన రాఘవేంద్రరావు ఇప్పుడు సీరియస్ పాత్రలో నటించనున్నారు. తన కవిత్వంతో చమత్కరించే తనికెళ్ల భరణి డైరెక్షన్ లో నే ఈ సినిమా. పెదవి విప్పని దర్శకేంద్రుడితో మాటలు మాట్లాడించనున్నారు. ఇప్పుడు లేటెస్టుగా సీనియర్ నటి లక్ష్మి ఆయన సరసన నటించనున్నదని తెలుస్తోంది. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించే లక్ష్మి మిథునంలో ఎస్పీ బాలు పక్కన ఈ తనికెళ్ల దర్శకత్వంలోనే నటించారు. అందుకేనేమో ఆయన మళ్లీ ఈ సినిమాకూ ఆవిడనే తీసుకున్నారు.

తెలుగు తెరపై తమ జోరు చూపించిన నిన్నటి తరం కథానాయికలలో లక్ష్మి ఒకరు. అప్పటి హీరోయిన్స్ లో లక్ష్మి వాయిస్ ప్రత్యేకంగా ఉండేది. రొమాంటిక్ ఎక్స్ ప్రెషన్స్ లో ఆమె తరువాతనే ఎవరైనా అనిపించుకున్నారు. 'మల్లెపువ్వు' సినిమాతో స్టార్ డమ్ సంపాదించుకున్న లక్ష్మి, ఇప్పటికీ తన వయసుకి తగిన పాత్రలను చురుకుగానే చేస్తూ వస్తున్నారు. ఈ మధ్య కాలంలో 'మిథునం' .. 'నానీస్ గ్యాంగ్ లీడర్' సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన ఆమె, ఇప్పుడు రాఘవేంద్రరావు సరసన నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

రాఘవేంద్రరావు ప్రధానమైన పాత్రధారిగా తనికెళ్ల భరణి ఒక సినిమా చేయనున్నారనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన సరసన నటించడానికి లక్ష్మిని ఎంపిక చేసినట్టుగా టాలీవుడ్ టాక్. రాఘవేంద్రరావు ఎక్కువ మౌనంగా ఉంటారు .. అలాంటి ఆయన నటనవైపుకు రావడం అభిమానుల్లో కుతూహలాన్ని పెంచుతోంది. ఈ సినిమాలో ఆయన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిగా కనిపిస్తారట. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో, శ్రియ గెస్ట్ రోల్ చేయనుందని అంటున్నారు.

Kranthi

Kranthi

Next Story