Top
logo

రివ్యూలు రాసేవారేమన్నా తోపులా? కమెడియన్ ఆలీ ఆగ్రహం!

రివ్యూలు రాసేవారేమన్నా తోపులా? కమెడియన్ ఆలీ ఆగ్రహం!
Highlights

సీనియర్ కమెడియన్ ఆలీ రివ్యూలు రాసేవారిపై ఫైర్ అయ్యారు. మీరేమైనా తోపులా.. అంటూ విరుచుకు పడ్డారు. ఇంతకీ ఆయనకు ఎందుకు అంత కోపం వచ్చిందో తెలుసా?

సీనియర్ కమెడియన్ ఆలీ రివ్యూలు రాసేవారిపై ఫైర్ అయ్యారు. మీరేమైనా తోపులా.. అంటూ విరుచుకు పడ్డారు. ఇంతకీ ఆయనకు ఎందుకు అంత కోపం వచ్చిందో తెలుసా? ఓంకార్ దర్శకత్వంలో ఆలీ రాజుగారిగది 3 సినిమాలో నటించారు. ఆ సినిమా శుక్రవారం (18.10.2019) న విడుదలైంది. ఈ సినిమాకి క్రిటిక్స్ రాసిన రివ్యూలు కొంచెం అటూ ఇటూ గా ఉన్నాయి. రేటింగులు అంత బాగా లేవు. అసలే ఆలీ చాలాకాలం తరువాత నటించిన సినిమా ఇది. దీంతో సినిమాకి రేటింగ్ లు ఇచ్చిన క్రిటిక్స్ పై ఆయనకు కోపం వచ్చింది.

ఈ సినిమా చాలా బావుందని ప్రేక్షకులు చెబుతున్నారని ఆలీ అంటున్నారు. ఈ సినిమాని కుకట్ పల్లి భ్రమరాంభ ధియేటర్ లో చూశాననీ అక్కడ ప్రేక్షకులు సినిమాని బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశారనీ ఆలీ చెప్పుకొచ్చారు. కొంత మంది మూర్ఖులు పనిగట్టుకుని సినిమా పై రాళ్ళు రువ్వుతున్నారన్నారు. వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. ఎవరో కోన్ కిస్కా గొట్టం గాళ్ళ కోసం సినిమాలు తీయమనీ ప్రేక్షక దేవుల్లకోసం సినిమాలు తీస్తామనీ, వారికి సినిమా నచ్చితే చాలనీ ఆలీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.


Next Story


లైవ్ టీవి