Seetimaarr Release Date : గోపీచంద్, మిల్కీ బ్యూటీ గేమ్ స్టార్ట్ ఎప్పుడంటే?

Seetimaarr Release Date : గోపీచంద్, మిల్కీ బ్యూటీ గేమ్ స్టార్ట్ ఎప్పుడంటే?
x

 ‘సీటీమార్‌’. 

Highlights

గోపీచంద్ ప్రధానపాత్రలో సంప‌త్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సీటీమార్‌’.

గోపీచంద్ ప్రధానపాత్రలో సంప‌త్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'సీటీమార్‌'. క‌బ‌డ్డీ ఆట నేప‌థ్యంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ఆంధ్ర మహిళల క‌బ‌డ్డీ జట్టు కోచ్‌గా గోపీచంద్ కనిపించనున్నారు. స్పోర్ట్స్ యాక్షన్ మూవీగా రూపొందుతోన్న సిటీమార్ లో హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ ‌త‌మ‌న్నా న‌టించారు. ‌త‌మ‌న్నాతెలంగాణ మహిళల క‌బ‌డ్డీ జట్టు కోచ్‌గా కనిపించనుంది. సినీయర్ నటి భూమిక చావ్లా కీల‌క పాత్రలో పోషిస్తున్నారు.

పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. గోపీచంద్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో ఈ సినిమా రూపొందుతోంది. మెలొడీ బ్రహ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు.

ఇప్పటికే విడుద‌లైన ఫస్ట్ లుక్స్‌ పోస్టర్ కు మంచి స్పందన వ‌చ్చింది. ఈ సినిమా విడుదల తేదీని దర్శకనిర్మాతలు ప్రకటించారు. ఏప్రిల్‌ 2వ తేదీన ప్రపంచ‌ వ్యాప్తంగా విడుద‌ల‌ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ‎

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. గోపీచంద్ కెరీర్‌లోనే ఇది హై బడ్జెట్, భారీ క‌మ‌ర్షియ‌ల్ ఫిలిం. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో సాగే భావోద్వేగభరిత కథాంశమిది. ప్రస్తుతం టాకీ పార్ట్ పూర్తయ్యింది. రెండు సాంగ్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. 'సిటీమార్' చిత్రాన్ని స‌మ్మర్ స్పెష‌ల్‌గా ఏప్రిల్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల‌చేస్తున్నాం' అని శ్రీనివాస్ తెలిపారు. ఈ మూవీలో సూర్యవంశి, పోసాని కృష్ణముర‌ళి, రావు ర‌మేష్‌‌, రెహ‌మాన్, బాలీవుడ్ యాక్టర్ త‌రుణ్ అరోరా కీలక పాత్రలు పోషించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories