ఎన్టీఆర్ బయోపిక్ పై సావిత్రి అభిమానులు ఆగ్రహం

N.T.R. Kathanayakudu
x
N.T.R. Kathanayakudu
Highlights

నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర లో మొదటి భాగం గా 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.

నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర లో మొదటి భాగం గా 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా ఈ మధ్యనే విడుదల అయింది కానీ అనుకున్నంత రేంజ్ లో ఈ సినిమాకు రెస్పాన్స్ రావడం లేదు. కేవలం ఎన్టీఆర్ లోని మంచిని మాత్రమే చూపించారని, అందులో ఎటువంటి నెగిటివ్ అంశాలు లేవని కేవలం ఎన్టీఆర్ పాత్రను గ్లోరిఫై చేయడానికి చేసిన ఒక ప్రయత్నం మాత్రమే అని కొందరు అంటున్నారు. అయితే ఈ సినిమాలో సావిత్రి పాత్రను కించపరిచినట్లు చూపించారని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సావిత్రి డబ్బు దుబారా చేయడం గురించి ఎన్టీఆర్ మరియు ఏఎన్ఆర్ లు ఆమెకు క్లాస్ పీకుతారు. సావిత్రి పాత్రను నెగిటివ్ గా చూపించటం బాగాలేదని సావిత్రి కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు. ఎన్టీఆర్ పాత్రను మాత్రం దేవుడు అన్నట్లుగా చూపించి సావిత్రి లో మాత్రం లోపాలను చూపిస్తున్నారని మండి పడుతున్నారు ఈ విషయమై మాట్లాడుతూ సావిత్రి జీవిత చరిత్ర గా తెరకెక్కిన 'మహానటి' సినిమా టీం లో ఒక వ్యక్తి మాట్లాడుతూ ఎన్టీఆర్ ఏఎన్నార్లు అమెరికాకు హార్ట్ సర్జరీ కోసం వెళ్లారు, ఏ అలవాట్ల కారణంగా ఆ సర్జరీ చేయించు కోవాల్సి వచ్చిందో కూడా చూపించి ఉంటే ఇంకా బాగుండేది అని చురకలు వేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories