NCB Confirms : రకుల్‌, సారా పేర్లు జాబితాలో లేవు : ఎన్‌సీబీ స్పష్టం!

NCB Confirms : బాలీవుడ్ దివంగంత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో A1 నిందితురాలుగా ఉన్న రియా చక్రవర్తిని డ్రగ్స్ కేసులో

Krishna
Published on: 14 Sept 2020 11:09 AM IST
NCB Confirms : రకుల్‌, సారా పేర్లు జాబితాలో లేవు : ఎన్‌సీబీ స్పష్టం!
X

rakul preet singh, sara ali khan

NCB Confirms : బాలీవుడ్ దివంగంత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో A1 నిందితురాలుగా ఉన్న రియా చక్రవర్తిని డ్రగ్స్ కేసులో భాగంగా నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) ఇటివల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.. ఆమెతో పాటుగా ఆమె సోదరుడు షోవిక్‌, శామ్యూల్‌ మెరిండాతోపాటు మరి కొంతమందిని అరెస్టు చేసి, విచారణ చేస్తోంది. అయితే ఎన్‌సీబీ చేసిన విచారణలో రియా చక్రవర్తి 25 మంది సెలబ్రిటీలు డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా వెల్లడించిందని అందులో టాలీవుడ్ నుంచి రకుల్ పేరు ఉందని వార్తలు షికార్లు కొట్టాయి. దీనితో రకుల్‌ప్రీత్‌పై నెటిజన్లు అనేక కామెంట్లు చేస్తూ వచ్చారు.

అయితే తాజాగా దీనిపైన ఎన్‌సీబీ స్పందించింది. రియా చక్రవర్తి వెల్లడించిన పేర్లలో రకుల్‌, సారా పేర్లు లేవని ఎన్‌సీబీ వెల్లడించింది. ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్‌ కేపీఎస్‌ మల్హోత్రా ఈ సందర్భంగా మాట్లాడుతూ.. " బాలీవుడ్‌ ప్రముఖుల జాబితాను మేం సిద్ధం చేయలేదు. మాదకద్రవ్యాల ముఠా, సరఫరా దారుల వివరాలు గుర్తించాం. అందరూ 'బాలీవుడ్‌' ప్రముఖుల పేర్లని తప్పుగా అర్థం చేసుకున్నారు" అని వెల్లడించారు. అనంతరం తప్పు తెలుసుకున్న నెటిజన్లు "సారీ రకుల్‌, సారీ సారా" అంటూ పోస్ట్ లు పెడుతున్నారు, వారందరి తరుపున స్టార్ హీరోయిన్ సమంత క్షమాపణలు చెప్పినట్టుగా పోస్ట్ పెట్టారు.

అయితే రకుల్‌ కూడా డ్రగ్స్‌ వాడుతుందంటూ వస్తున్న పుకార్లపై ఆమె సన్నిహితులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్తలతో కాస్తా అసహనానికి గురైన రకుల్ ప్రీత్ సింగ్ శనివారం వికారాబాద్ శివారులోని షూటింగ్ స్పాట్ నుంచి జూబ్లీహిల్స్‌ లోని తన నివాసానికి వెళ్ళిపోయింది. అయితే ఆమెపై వస్తున్న వార్తలను ఆమె మేనేజర్ మాత్రం ఖండించారు. తనపై కుట్రతో ఇదంతా చేస్తున్నారని వాదించారు.

Krishna

Krishna

Next Story