రియా డ్రగ్స్ లింక్ రకుల్ వరకూ వచ్చింది.. తరువాత ఎవరో?

రియా డ్రగ్స్ లింక్ రకుల్ వరకూ వచ్చింది.. తరువాత ఎవరో?
x
Highlights

తీగ లాగితే.. డొంక కదిలినట్లు డ్రగ్స్ కేసులో గుట్టంత బయటకు వస్తోంది. ఎవరి పేరు బయటకు వస్తుందో అని సినీ స్టార్లకు గుబులు పట్టుకుంది....

తీగ లాగితే.. డొంక కదిలినట్లు డ్రగ్స్ కేసులో గుట్టంత బయటకు వస్తోంది. ఎవరి పేరు బయటకు వస్తుందో అని సినీ స్టార్లకు గుబులు పట్టుకుంది. డ్రగ్స్ కేసులో అరెస్టైన నటి రియా చక్రవర్తి ఉన్నతాధికారుల విచారణలో పలు సంచలన విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. 14 రోజుల కస్టడీలో ఉన్న రియా 20 పేజీల వివరణాత్మక స్టేట్‌మెంట్‌ను ఎన్‌సీబీకి అందించారు. బాలీవుడ్‌లో మాదకద్రవ్యాల సరఫరా, కొనుగోలు చేసే 25 మంది సెలబ్రిటీల పేర్లను అందులో వెల్లడించినట్లు తెలుస్తోంది.

అయితే ఆమె ఎన్‌సీబీకి అందించిన స్టేట్‌మెంట్‌లో నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌తో పాటు సారా అలీఖాన్‌, ప్రముఖ డిజైనర్‌ సిమోనీ ఖంబట్టా ఉన్నారని పలు ఆంగ్ల పత్రికల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ మేరకు సదరు నటీనటులను త్వరలోనే విచారించనున్నట్లు సమాచారం. కాగా, సెప్టెంబర్‌ 8 నార్కోటిక్స్‌ కేసులో అరెస్టయిన రియా, ఆమె సోదరుడు షోవిక్‌ ప్రస్తుతం జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. రియాతో పాటు ఆమె సోదరుడు, మరో నలుగురు పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్లను ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం తిరస్కరించింది.Show Full Article
Print Article
Next Story
More Stories